టాలీవుడ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకి ఇచ్చే విలువ ఎంతటితో తెలిసిందే. తీసేది సైన్ ఫిక్షన్ సినిమా అయినా సరే సరైన సమయానికి కొబ్బరికాయ పగలాల్సిందే అంటుంటారు. అలా జరగలేదంటే నిర్మాత మరో కొత్త ముహూర్తాన్ని చూసుకొస్తాడు. హీరోలు సైతం ఆ సెంటిమెంట్లని బలంగా ఫాలో అవుతుంటారు. కొద్దిమంది తమ సినిమాల పేర్లలో రెండే అక్షరాలు వుండాలంటుంటారు. మరికొద్దిమంది మూడక్షరాల పేరు అనుకొనే తన దగ్గరికి రావాలంటుంటారు. నిజంగానే అలా సెంటిమెంట్ ప్రకారం వెళ్లితేనే కొద్దిమందికి సక్సెస్ లు వస్తుంటాయి. అందుకే వాళ్లు ఆ నమ్మకాల్ని మరింత బలంగా విశ్వసిస్తుంటారు. అలా దిల్‌రాజు కూడా కొత్తగా మరో సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నాడట.
తాను నిర్మించే సినిమాల పేర్లలో ఇక రాముడు - కృష్ణుడు అన్న పేర్లను వాడకూడదు అని నిర్ణయించుకున్నాడట. అదేంటి? ఎందుకలా అంటారా? ఆయనకి రాముడు - కృష్ణుడులతో కూడిన పేర్లు పెద్ద గాయాల్నే చేశాయి మరి! రామ్ తో రామ రామ కృష్ణ కృష్ణ అనే సినిమా చేశాడు దిల్ రాజు. కానీ ఆ చిత్రం ఫెయిల్యూర్ అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో రామయ్యావస్తావయ్యా అనే సినిమా చేశాడు. అది కూడా దారుణంగా దెబ్బకొట్టింది. మొన్నటికి మొన్న కృష్ణాష్ణమి అని సునీల్ తో ఓ సినిమా చేశాడు. దానికైతే పెట్టిన డబ్బు కూడా తిరిగి రాలేదు. అలా రాముడు - కృష్ణుడు పేర్లతో తీసిన సినిమాలన్నీ బోల్తా కొట్టడంతో ఇక వాళ్ల జోలికే వెళ్లనంటున్నాడు దిల్ రాజు. ఒకవేళ కథ డిమాండ్ చేసినా మరో పేరు ఆలోచిస్తాడేమో తప్ప ఆ పేర్లు మాత్రం పెట్టడేమో అన్నట్టుగా మాట్లాడాడు దిల్ రాజు. ఎవరి అనుభవాలు వాళ్లవి మరీ!