దిల్ రాజు..గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో రీసౌండ్ ఇస్తున్న పేరిది. ఏ ఇష్యూ వైరల్ అయినా దాని వెనక, ముందు దిల్ రాజు పేరు ఖచ్చితంగా వుంటూ వస్తోంది. టాలీవుడ్ షూటింగ్ ల బంద్ నుంచి `వారసుడు` థియేటర్ల వివాదం వరకు ప్రతీ విషయంలోనూ గత కొన్ని నెలలుగా దిల్ రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తూ నెట్టింట వైరల్ గా ట్రెండ్ అవుతోంది. తాజాగా మరో సారి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం గమనార్హం.
వివరాల్లోకి వెళితే...దిల్ రాజుకు బన్నీవాసు, సితార, హారిక అండ్ హాసిని, మైత్రీ, యువీ ఇలా ఇండస్ట్రీలో వున్న ప్రతీ నిర్మాణ సంస్థతో స్టార్ హీరోలతో మంచి సంబంధాలున్నాయి. అయితే ఈ మధ్య దిల్ రాజు అనుసరిస్తున్న విధానం వల్ల ఆ సంబంధాలు బెడిసి కొడుతున్నాయా? .. లేక దిల్ రాజు కావాలనే అలా చేసుకుంటూ, వివాదాస్పదంగా మాట్లాడుకుంటూ వెళుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరీ ముఖ్యంగా తనతో సన్నిహితంగా వుండే బన్నీవాసు, సితారలకు దిల్ రాజు తాజాగా ఝలక్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
బన్నీవాసు నిర్మించిన `వినరో భాగ్యము విష్ణుకథ`, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన `సార్` చిత్రాలు ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ లని వీరు ఎప్పుడో నిర్ణయించడమే కాకుండా అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ఇదే రోజున దిల్ రాజు `శాకుంతలం` ను రిలీజ్ చేస్తున్నానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. రిలీజ్ డేట్ ల విషయంలో క్లాష్ రాకుండా చూసుకోవాలని గతంలో పలు మీటింగ్ లు జగిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే బన్నీవాసు నిర్మించిన `వినరో భాగ్యము విష్ణుకథ` మూవీ టీజర్ ని 9న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇదే రోజున `శాకుంతలం` ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నామని దిల్ రాజు ప్రకటించడంతో `వినరో భాగ్యము విష్ణుకథ` టీజర్ రిలీజ్ ని జనవరి 10కి వాయిదా వేయడం గమనార్హం. ఆ మధ్య నాగచైతన్య, నితిన్ సినిమాల కోసం నిఖిల్ నటించిన `కార్తికేయ 2` రిలీజ్ ని ఫోర్స్ గా దిల్ రాజు వాయిదా వేయించారనే కామెంట్ లు వినిపించాయి.
హీరో నిఖిల్ ఇదే విషయాన్ని ఇండైరెక్ట్ గా మీడియాకు చెప్పడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై ఆ తరువాత దిల్ రాజు వివరణ ఇవ్వడంతో వివాదం సమసిపోయింది. తాజాగా ఇదే తరహాలో దిల్ రాజు చెప్పడం వల్లే `వినరో భాగ్యము విష్ణు కథ` టీజర్ రిలీజ్ ని వాయిదా వేశారంటూ ప్రచారం జరుగుతోంది.