నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్యూ సినిమా ఊరించి ఊరించి ఇటీవల విడుదల అయ్యింది. సినిమా ఊహించినంతగా లేదని జనాలు ఉసూరుమంటున్నారు. నాగ చైతన్య హీరోగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు దక్కించుకుంటూ మంచి వసూళ్లు దక్కించుకుంటూ హ్యాట్రిక్ కొట్టిన సమయంలో వచ్చిన థాంక్యూ అక్కినేని ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశ పరిచింది.
దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాలు మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఆడాయి. పైగా తెలుగు లో ఈయన తీసిన ఇష్క్.. మనం మరియు 24 సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కాని థాంక్యూ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డట్లుగానే అనిపిస్తుంది. ఓపెనింగ్స్ కలెక్షన్స్ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ అసాధ్యం అనే టాక్ వినిపిస్తుంది.
థాంక్యూ సినిమా మినిమం ఆడక పోవడానికి కారణం దిల్ రాజు గారి కత్తెర అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు దిల్ రాజు సినిమా పూర్తి అయిన తర్వాత ఎడిటింగ్ రూమ్ లో చేసే మార్పులతో మంచి ఫలితాలు వచ్చాయి. కాని థాంక్యూ విషయంలో ఆ మార్పులే ఈ ఫలితం కు కారణం అయ్యిందని కామెంట్స్ వస్తున్నాయి.
థాంక్యూ సినిమా లో విక్రమ్ మార్క్ కొన్ని మంచి సన్నివేశాలు.. ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ఉన్నాయట. కాని వాటిని దిల్ రాజు నిడివి ఎక్కువ అయ్యిందనే ఉద్దేశ్యంతో దిల్ రాజు ఎడిట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నాని అంటే సుందరానికి సినిమా నిడివి విషయంలో జరిగిన తప్పిదం థాంక్యూ విషయంలో రిపీట్ అవ్వకూడదనే దిల్ రాజు ఈనిర్ణయం తీసుకున్నాడు.
ఇప్పుడు ఆ నిర్ణయమే సినిమా కు చెడు చేసిందని యూనిట్ వర్గాల వారు అనధికారికంగా అంటున్నారు. థాంక్యూ సినిమా వసూళ్లు దారుణంగా ఉన్న ఈ సమయంలో కొందరు ఈ విషయాన్ని అంటున్నారు. విక్రమ్ కుమార్ కు ఫ్రీడమ్ ఇవ్వలేదనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.
మొత్తానికి సినిమా ఆశించిన స్థాయిలో రానప్పుడు లేనప్పుడు ఇలాంటి విమర్శలు.. ఇలాంటి కామెంట్స్ రావడం కామన్. గతంలో దిల్ రాజు ఎన్నో సినిమాలకు చివరి నిమిషంలో కత్తెర వేసి హిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ఆయన కత్తెర కాస్త పదును అవ్వడం వల్లో లేదా మరేదో కారణం వల్లో ఆశించిన ఫలితం రాలేదు.