దిల్ రాజు ఒడ్డున పడతాడా?

Update: 2016-03-25 13:30 GMT
దిల్ రాజు ఎంతగా ప్లాన్ చేసినా.. ఎన్ని రకాల మార్కెటింగ్ టెక్నిక్స్ అప్లై చేసినా.. సునీల్ తో తీసిన కృష్ణాష్టమి మాత్రం బాగానే దెబ్బ తీసింది. ఇప్పుడీ మూవీ ఇచ్చిన  షాక్ నుంచి ఈ ప్రొడ్యూసర్ బయటపడుతున్నాడు. సమ్మర్ సీజన్ ని టార్గెట్ చేసి, తన నష్టాలను రికవర్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు దిల్ రాజు. నిజానికి అసలు సమ్మర్ ని సాయిధరంతేజ్ 'సుప్రీం' మూవీతో దిల్ రాజునే స్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే, అనుకోని కారణాలతో ఈ సినిమా ఏప్రిల్ 1కి రావడం సాధ్యపడటం లేదు.

ఇప్పుడు కోలీవుడ్  హీరో విజయ్ కి ఇక్కడ ఉన్న క్రేజ్ ని బేస్ చేసుకుని.. 'తెరి'కి సంబంధించిన డబ్బింగ్ రైట్స్ ను కొనేశాడు దిల్ రాజు. తెరి ట్రైలర్ అన్ని ఏరియాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో.. తెలుగు ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది. మరోవైపు.. సమంత ఇందులో హీరోయిన్ గా నటించడంతో పాటు, అమీ జాక్సన్ గ్లామర్ కురిపించింది. ఈ ఇద్దరు భామలు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన వాళ్లే కావడంతో.. దిల్ రాజు నమ్మకం రెట్టింపైంది.

తెలుగులో కూడా తెరి పెద్ద హిట్ అవుతుందని ఈ నిర్మాత నమ్ముతున్నాడు. తెరిని తమిళ్ తో పాటే తెలుగులో కూడా ఏప్రిల్ 14నే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు(మార్చ్ 26) సాయంత్రం తెరి తెలుగు వెర్షన్ కి టైటిల్ అనౌన్స్ చేసేందుకు దిల్ రాజు సిద్ధమవుతున్నాడు.

Tags:    

Similar News