దిల్ రాజు టాలీవుడ్ లో పేరు మోసిన నిర్మాత అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న హీరోల నుండి సూపర్ స్టార్ వరకు ఎంతో మందితో సినిమా లు నిర్మించి దిల్ రాజు అనే పేరును బ్రాండ్ గా మార్చేసుకుని తన చేయి వేస్తే సినిమా రేంజ్ పెరిగి పోతుంది అన్నట్లుగా మారిపోయారు. దిల్ రాజు ఇన్నాళ్లు తెలుగు వరకే పరిమితం అయ్యారు. కాని ఇప్పుడు తమిళం మరియు హిందీకి కూడా తన బ్రాండ్ ను విస్తరించేందుకు సిద్దం అయ్యారు. తమిళ స్టార్ హీరో విజయ్ తో ఒక సినిమాను.. స్టార్ డైరెక్టర్ శంకర్ తో మరో సినిమాను చేసేందుకు దిల్ రాజు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాడు.
ఇక బాలీవుడ్ లో ఈయన వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు. జెర్సీ సినిమా ను హిందీలో నిర్మిస్తున్న దిల్ రాజు మరి కొన్ని సినిమాలను కూడా అక్కడ రీమేక్ చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. హిట్ మరియు నాంది సినిమాల రీమేక్ లను అధికారికంగా ప్రకటించిన దిల్ రాజు ఎఫ్ 2 మరియు ఎఫ్ 3 లను కూడా అక్కడ రీమేక్ చేసే విషయమై ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఆయన అయిదు ఆరు ప్రాజెక్ట్ లను కన్ఫర్మ్ చేసినా ఒక్కటి కూడా డైరెక్ట్ సినిమా లేదు. అన్ని రీమేక్ లే ఉండటం వల్ల బాలీవుడ్ సినీ జనాలు దిల్ రాజును రీమేక్ ప్రొడ్యూసర్ గా గుర్తిస్తున్నారు.
ఇక కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమా ను ఈయన నిర్మించాల్సి ఉంది. 2025 వరకు దిల్ రాజు పాన్ ఇండియా స్టార్ నిర్మాతగా మారడం ఖాయం అంటున్నారు. ఇప్పటి వరకు పాన్ ఇండియా హీరో.. హీరోయిన్.. డైరెక్టర్ మాత్రమే ఉన్నారు. కాని త్వరలోనే దిల్ రాజు మొదటి పాన్ ఇండియా స్టార్ నిర్మాతగా పేరు దక్కించుకుంటాడేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. బాలీవుడ్ లో రీమేక్ లు కాకుండా కొత్త కథలతో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే మన తెలుగు ఖ్యాతి మరింతగా అక్కడ పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.