సునీల్ కోసం దిల్ రాజు గాత్రం

Update: 2017-08-31 11:24 GMT
ఒకప్పుడు తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తిన సునీల్ హీరోగా మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోతున్నాడు. మర్యాద రామన్న తర్వాత ఆ స్థాయిలో ఇంతవరకు సునీల్ హిట్ ను అందుకోలేదు. అలాగే సీనియర్ దర్శకులతో నిర్మాతలతో సినిమాలు చేస్తున్న ఏ మాత్రం అదృష్టం కలిసిరావడం లేదు. దీంతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని మరో కామెడీ కథతో రాబోతున్నాడు.

ఓనమాలు - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఉంగరాల రాంబాబు అనే సినిమాతో త్వరలో రాబోతున్నాడు. ఇప్పటికే చాలా డేట్లు మిస్సయిన ఈ సినిమాకు ఇప్పుడు ఒక అట్రాక్షన్ యాడ్ చేస్తున్నారులే. ఈ సినిమాకి సునీల్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో వాయిస్ ఓవర్ ఇప్పించనున్నారట. ఇప్పటివరకు నిర్మాతగా ఎన్నో సినిమాలను తెరకెక్కించిన దిల్ రాజు తన సినిమాలకే వాయిస్ ఓవర్ చెప్పలేదు. కానీ ఇప్పుడు సునీల్ కోసం తన గొంతును అందించబోతున్నాడట. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో వచ్చిన జక్కన చిత్రం ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే.  

అయితే సునీల్ ఇప్పుడు తన ఆశలన్నిటిని ఉంగరాల రాంబాబు సినిమా మీదనే పెట్టుకున్నాడు. మంచి సక్సెస్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఒక్క మాట సినిమాలో పడితే తను కూడా సక్సెస్ ట్రాక్ లో పడాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాని నిర్మాత పరుచూరి కిరీటి సెప్టెంబర్ 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. సునీల్ సరసన మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. 
Tags:    

Similar News