50 ఏళ్ల ఆ హీరో.. కూతుర్ని కన్నాడు

Update: 2018-11-19 07:12 GMT
మలయాళ నటుడు దిలీప్ పాతికేళ్లుగా సినిమాలు చేస్తున్నాడు. ఐతే వంద దాకా సినిమాలు చేస్తే వచ్చిన ఫేమ్ కంటే.. ఒక వివాదంతో ఎక్కువ ‘పేరు’ వచ్చింది. గత ఏడాది అతడి పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఒక మలయాళ స్టార్ హీరోయిన్ మీద జరిగిన దాడి కేసులో అతను ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ కేసుకు సంబంధించి కొన్ని నెలల పాటు జైల్లో కూడా గడిపి వచ్చాడు.  ఈ కేసులో అతడి రెండో భార్య కావ్య మాధవన్ సైతం ఆరోపణలు ఎదుర్కొంది. ఇంతకుముందు ఒకప్పటి స్టార్ హీరోయిన్ మంజు వారియర్ ను పెళ్లాడి ఒక కూతురిని కూడా కన్నాడు. ఆమెతో కొన్నేళ్ల కిందటే విడాకులు తీసుకుని కావ్యను పెళ్లాడాడు దిలీప్. పెళ్లయిన కొంత కాలానికే అతడి మెడకు ఈ కేసు చుట్టుకుంది.

కొన్ని నెలల జైలు జీవితం తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చిన దిలీప్.. ఇప్పుడు ఓ సంతోషకరమైన వార్తను అందుకున్నాడు. అతడి భార్య కావ్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 50 ఏళ్ల వయసులో దిలీప్ తండ్రి కావడం విశేషమే. ఐతే దీని గురించి దిలీప్ పెద్దగా ప్రచారం చేసుకోవట్లేదు. ఇప్పటికే అనేక ప్రతికూల వార్తలతో మీడియాలో హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో ఈ వార్తను గోప్యంగానే ఉంచారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు కానీ.. హీరోయిన్ పై దాడి కేసు అతడిని ఇప్పుడిప్పుడే విడిచిపెట్టేలా లేదు. విచారణ కొనసాగుతోంది. ఐతే ఒకప్పటి స్థాయిలో కేసు తీవ్రత లేదని అంటున్నారు. ఈ కేసును నీరుగార్చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. త్వరలోనే దిలీప్ కేసు నుంచి బయటపడొచ్చని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే దిలీప్ జైల్లో ఉండగా విడుదలైన ‘రామ్ లీలా’ సూపర్ హిట్టవగా.. ఆ తర్వాత అతను నటించిన ‘కమ్మర సంభవం’ అంచనాల్ని అందుకోలేకపోయింది.
Tags:    

Similar News