క‌ళాభ‌వ‌న్ మ‌ణి మృతి వెనుక ఆ హీరో?

Update: 2017-07-13 09:21 GMT
మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఏమైంద‌న్న సందేహం క‌లిగేలా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వెండి తెర మీద హీరోగా వెలిగిపోయే దిలీప్ లీల‌లు అంటూ బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మాచారం ఇప్పుడు షాకుల మీద షాకులు త‌గిలేలా చేస్తున్నాయి. ప్ర‌ముఖ న‌టిని కిడ్నాప్ చేసి ఆమెపై లైంగిక దాడి చేసిన ఉదంతంలో మ‌ల‌యాళ న‌టుడు దిలీప్ కుమార్ హ‌స్తం ఉంద‌న్న వార్త దిమ్మ తిరిగేలా చేసింది.

పోలీసుల సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం దిలీప్‌ ను అరెస్ట్ చేయ‌టం ఒక షాక్ అయితే.. తాజాగా మ‌రో సంచ‌ల‌న వాద‌న తెర మీద‌కు వ‌చ్చింది. ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌.. మ‌ల‌యాళ‌.. త‌మిళ‌.. తెలుగు చిత్రాల్లో విల‌న్ పాత్ర‌లు పోషించిన క‌ళాభ‌వ‌న్ మ‌ణి అనుమానాస్ప‌ద మృతిలోనూ దిలీప్ హ‌స్తం ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. కొన్ని ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల క‌థ‌నాల ప్ర‌కారం.. మ‌ణి మ‌ర‌ణంలో దిలీప్ హ‌స్తం ఉంద‌ని మ‌ణి సోద‌రుడు రామ‌కృష్ణ‌న్.. ద‌ర్శ‌కుడు బైజు కొట్టార‌క్క‌ర ఆరోపిస్తున్నారు.

ఉత్త‌గానే తాము ఆరోప‌ణ‌లు చేయ‌టం లేద‌ని.. త‌మ ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్న‌ట్లుగా వారు చెబుతున్నారు. మ‌ణి అనుమానాస్ప‌ద మృతిపై సీబీఐ విచారిస్తోంది. తాజాగా..  సీబీఐ అధికారుల‌కు మ‌ణి సోద‌రుడు కొంత స‌మాచారం ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. భూముల విష‌యంలో మ‌ణికి.. దిలీప్‌కి గొడ‌వ జ‌రిగింద‌ని.. అదే చివ‌ర‌కూ అత‌ని మ‌ర‌ణానికి దారి తీసిన‌ట్లుగా చెబుతున్నారు. రీల్ లైఫ్ లో విల‌న్ వేషాలు వేసే మ‌ణి మ‌ర‌ణం.. అదే రీల్ లైఫ్ లో హీరో పాత్ర‌లు పోషించే దిలీప్ రియ‌ల్ గా హ‌త్య చేయించారా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. మ‌రి.. ఈ ఆరోప‌ణ‌ల‌పై పోలీసులు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేస్తార‌న్న‌ది ఇప్పుడు ఉత్కంట‌గా మారింది.


Tags:    

Similar News