అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన దేవ దాసు సినిమాను హిందీలో దిలీప్ కుమార్ రీమేక్ చేశారు. దేవ దాసు ను దిలీప్ కుమార్ చేయడంతో సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు తెలుగు కంటే పెద్ద విజయం దక్కించుకుందంటూ జాతీయ మీడియా కథనాలు రాశారు. ఒరిజినల్ వర్షన్‌లో హీరో కంటే దిలీప్ కుమార్ బాగా నటించారు అంటూ అప్పట్లో కొందరు సినీ విశ్లేషకులు అనే వారు. ఆ సమయంలో దిలీప్ కుమార్ మాత్రం అక్కినేని వారిపైనే ప్రశంసలు కురిపించే వారు. దేవ దాసు అంటే ఒక్కరే ఉంటారు. ఆ దేవ దాసు తన దృష్టిలో ఏయన్నార్ అంటూ పలు సందర్బాల్లో ఆయన అన్నారు అంటే ఆయన సింప్లిసిటీ మరియు వినమ్రతను అర్థం చేసుకోవచ్చు.
హిందీ దేవదాసు రావడానికి రెండేళ్ల ముందే తెలుగు దేవ దాసు వచ్చింది. హిందీలో దిలీప్ కుమార్ దేవ దాసు వచ్చిన తర్వాత అప్పట్లో ఆయనకు ట్రాజడీ కింగ్ అంటూ పేరు వచ్చింది. దేవ దాసు పాత్రను అద్బుతంగా పోషించినందుకు గాను దిలీప్ కుమార్ కు ఎన్నో అవార్డులు కూడా వరించాయి. నిజంగా దేవదాసు ఉంటే కూడా ఇలా ఉంటాడా అన్నట్లుగా దిలీప్ కుమార్ నటించారు. అయినా కూడా నా కంటే అక్కినేని నాగేశ్వరరావు గారే చక్కగా దేవదాసు గా నటించారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మృతి సందర్బంగా వైరల్ అవుతున్నాయి.
దిలీప్ కుమార్ మృతి నేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక తెలుగు నిర్మాణ సంస్థ అయిన పక్షి రాజాలో కూడా దిలీప్ కుమార్ అప్పట్లో ఆజాద్ సినిమాను చేశాడు. తెలుగు నిర్మాణ సంస్థ లో సినిమా చేసేందుకు అప్పట్లో ఆయన చాలా ఆసక్తి చూపించారనే టాక్ కూడా ఉంది. ఒకే కథతో తెలుగు లో ఎన్టీఆర్ తో తమిళంలో ఎంజీఆర్ మరియు హిందీలో దిలీప్ కుమార్ తో సినిమాను ఎస్‌ఎం శ్రీరాములు నిర్మించారు.