శ్రీవారి సన్నిధిలో కొడుకు తో దిల్‌ రాజు.. షూటింగ్‌ బంద్‌ పై కామెంట్స్‌

Update: 2022-08-05 10:35 GMT
టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలు సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. సినిమా నిర్మాణం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మేకింగ్ అత్యంత కష్టంగా మారింది. దాంతో బడ్జెట్‌ లు తగ్గించడంతో పాటు ఇతర విషయాల్లో తమ సమస్యలకు పరిష్కారం కలిగించాల్సిందే అంటూ యాక్టివ్‌ నిర్మాతల గిల్డ్‌ ఈ సమ్మెను చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ సమ్మె పై పలువురు పలు రకాలుగా మాట్లాడుతున్నారు. కొందరు ఈ సమ్మెకు మద్దతుగా నిలుస్తూ ఉంటే మరి కొందరు మాత్రం నిర్మాతల తీరును తీవ్రంగా తప్పబడుతున్నారు. సినిమా ఇండస్ట్రీకి యాజమాన్యం నిర్మాతలే.

ఇప్పుడు ఆ యాజమాన్యం సమ్మెకు దిగడం ఏంటో అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో సుమన్‌ కూడా సమ్మె పై  తనదైన శైలిలో స్పందించాడు.

దిల్‌ రాజు నిర్మాతల గిల్డ్ యొక్క ముఖ్య నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఆయన కొడుకు తో మొదటి సారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలోనే అక్కడి మీడియా వారికి భార్య మరియు కొడుకుతో కలిసి ఫొటోలకు ఫోజు ఇచ్చాడు.

ఆ సందర్బంగా మీడియా వారు సినిమా ఇండస్ట్రీ లో సమ్మె విషయమై దిల్ రాజును మాట్లాడించే ప్రయత్నం చేశారు.

సుమన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కూడా దిల్‌ రాజును కోరగా.. శ్రీవారి సన్నిధిలో ఆ విషయాలను గురించి మాట్లాడాలని నేను అనుకోవడం లేదు. ఇది సరైన సమయం కాదని నేను భావిస్తున్నాను అంటూ దిల్‌ రాజు అక్కడ నుండి వెళ్లారట.
Tags:    

Similar News