పాత క్రేజ్‌ ను రిపీట్ చేస్తారంటారా?

Update: 2015-11-20 05:19 GMT
బాలీవుడ్ నుంచి తెలుగు తెర‌కి వ‌చ్చి నాటి మేటి క్లాసిక్‌ గా నిలిచిపోయిన సినిమా `ప్రేమించి పెళ్లాడుతా`. హిందీలో దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే .. (డీడీఎల్‌ జే) పేరుతో రిలీజై కొన్ని సంవ‌త్స‌రాల పాటు నిరాఠంకంగా బాక్సాఫీస్ వ‌సూళ్లు సాధించిన సినిమాగా సంచ‌ల‌నం సృష్టించింది. ఓ అద్భుత‌మైన ప్రేమ‌క‌థ‌ - ఫ్యామిలీ డ్రామా, అంత‌కుమించి స్విట్జ‌ర్లాండ్‌లోని అరుదైన లొకేష‌న్లు డీడీఎల్‌ జే విజ‌యానికి ఆయువు పోశాయి. అందుకే అదే కోవ‌లో మై నే ప్యార్ కియా - హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్ .. వంటి సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల్ని సైతం మెప్పించాయి.

ఇప్ప‌టికీ క్రిష్‌ - ధూమ్ సిరీస్ సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల నుంచి బాక్సాఫీస్ సొమ్ముల్ని ఎగ‌రేసుకుపోతున్నాయి. హిందీ సినిమాకి తెలుగులో క్రేజు ఉంది. ప‌రాయి సినిమాకి కాసులు రాల్తాయి.. అన్న గ్యారెంటీ వ‌చ్చింది. అందుకే హిందీలో ఏ భారీ సినిమా అయినా తెలుగులో కూడా డ‌బ్బింగ్ అయ్యి రిలీజ‌వుతూనే ఉన్నాయ్‌.  ఆ కోవ‌లోనే షారూక్‌ ఖాన్ - కాజోల్ జంట చాలా గ్యాప్ త‌ర్వాత న‌టిస్తున్న దిల్‌ వాలే సినిమా ఈసారి తెలుగులోనూ రిలీజ్‌ కి వ‌స్తోంది అన‌గానే ఎంతో క్రేజు ఏర్ప‌డింది. ఈ  మూవీలో డీడీఎల్‌ జేని కొట్టే పాట‌లున్నాయ్ అంటూ ఇప్ప‌ట్నుంచే ప్ర‌చారం సాగుతోంది.

రామోజీ పిలింసిటీ - బ‌ల్గేరియా లాంటి చోట గెరువా అంటూ సాగే ఓ యుగ‌ళ‌గీతాన్ని తెర‌కెక్కించారు. బ‌ల్గేరియా అంటే బాహుబ‌లి లోని పోరాట స‌న్నివేశాలు గుర్తొస్తాయి. అంటే ఈ పాట‌లో మంచు కొండల్లో షాట్స్ చూసేప్పుడు బాహుబ‌లి లొకేష‌న్స్ క‌నిపిస్తాయ‌న్న‌మాట. రోహిత్ శెట్టి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 18న  సినిమా రిలీజ‌వుతోంది. మరి పాత క్రేజ్‌ ను రిపీట్‌ చేస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News