క్యాచ్‌ మీ అనడం కోసం 6 కేజీలు తగ్గిందట

Update: 2022-02-10 17:30 GMT
రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్స్ గా డింపుల్‌ హయతి మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్‌ గా నటించిన విషయం తెల్సిందే. ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఈ సినిమా కోసం పోటీ పడి అందాలను ఆరబోసినట్లుగా ట్రైలర్ మరియు పాటలను చూస్తుంటే అనిపిస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ముద్దుగుమ్మ డింపుల్‌ హయతీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలోని క్యాచ్ మీ పాట కోసం ఏకంగా ఆరు కేజీల బరువు తగ్గినట్లుగా చెప్పుకొచ్చింది.

క్యాచ్ మీ పాట షూటింగ్ కు ముందు కాస్త లావుగా ఉన్నాను అనిపించడంతో దర్శకుడు రమేష్ వర్మ గారు కాస్త బరువు తగ్గాలని సూచించారు. అప్పుడు నేను వర్కౌట్స్ చేస్తూ డైటింగ్‌ చేస్తూ ఏకంగా ఆరు కేజీల బరువు తగ్గాను అని చెప్పుకొచ్చింది. ఆ పాటలో అందంగా కనిపించడం కోసం ట్రెండీ డ్రస్ లు వేశాను. సినిమా మొత్తంలో ఎక్కువ శాతం లంగా ఓనీలో కనిపించే ఈ అమ్మడు కొన్ని సన్నివేశాల్లో మాత్రం స్కిన్‌ షో చేసింది. సినిమా లో ఫైట్స్ సందర్బంలో కాకుండా పూర్తిగా కనిపిస్తాను అంది. సినిమా లో ఎక్కువ స్క్రీన్‌ స్పేస్ దక్కిందని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. రవితేజ తో చేసిన ఈ సినిమా తన కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్ గా నిలుస్తుందనే నమ్మకంతో ఈ అమ్మడు ఉంది.

కలర్ తక్కువ అంటూ గతంలో ఈ అమ్మడికి చిత్కారాలు ఎదురయ్యాయట. అలాంటి సమయంలో వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుని ఇప్పుడు ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ను దక్కించుకుంది. గద్దల కొండ గణేష్‌ సినిమాలో ఈ అమ్మడు చేసిన ఐటెం సాంగ్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట తర్వాత వరుసగా ఐటెం సాంగ్స్ వచ్చినా హీరోయిన్ గా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఆ ఆఫర్లను ఈ అమ్మడు కాదన్నట్లుగా కూడా తెలుస్తోంది. కలర్ తక్కువ ఉన్నావు అంటూ విమర్శించిన వారికి ఖిలాడి సినిమా సమాధానంగా నిలుస్తుంది అంటూ ఆమె చెప్పకనే చెబుతోంది. ఖిలాడి సినిమాలో ఈ అమ్మడి అందాల ఆరబోత మరియు నటనకు మంచి మార్కులు పడటం ఖాయం.. తద్వారా వరుసగా సినిమా ఆఫర్లు రావడం కూడా ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News