అనిల్ రావిపూడి.. టాలీవుడ్ లో ఇప్పుడీయన పేరు మారుమోగిపోతోంది. రచయితగా సినీ ఇండస్ట్రీలో కెరీర్ను ప్రారంభించిన ఈయన.. నందమూరి కళ్యాణ్ రామ్ తో `పటాస్` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఈయన నుంచి వచ్చిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరుతో సహా మొన్నీమధ్య విడుదలైన ఎఫ్ 3 సైతం మంచి విజయాలు అందుకున్నాయి.
ఎంటర్టైన్మెంట్ కి అధిక ప్రాముఖ్యతను ఇస్తూ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న అనిల్ రావిపూడి.. తాజాగా హ్యాట్రిక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని అపజయం ఎరుగని దర్శకుడిగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. అయితే వరుస హిట్లు పడుతుంటే ఏ దర్శకుడికైనా మంచి కిక్ వస్తుంది. కానీ, అనిల్ రావిపూడికి మాత్రం భయం పెరుగుతోందట. అసలు భయమెందుకని అంటారా..? అందుకు రీజన్ కూడా ఆయన వివరించారు.
తాజాగా అనిల్ రావిపూడి ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో `సక్సెస్లు వరుసగా వస్తున్నాయి కదా! కిక్ పెరిగిందా..?` అని ప్రశ్నించగా.. అందుకు అనిల్ రావిపూడి `వరుస విజయాల వల్ల కిక్కు కంటే ఎక్కువగా భయం పెరుగుతుంది. పొరపాటున నేను తీసే సినిమా రిజల్ట్ ఏదైనా తేడా వస్తే.. ఇప్పటి వరకు పొగిడిన వారే.. తిడతారు. అందుకే భయం పెరుగుతోంది` అంటూ సమాధానం ఇచ్చారు.
అలాగే తనకు హీరోయిన్ నగ్మా అంటే పిచ్చ ఇష్టమని, యంగ్ ఏజ్ లో ఆమెను అలా చూస్తూ ఉండిపోయేవాడినని, టైమ్ కూడా తెలిసేది కాదని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ప్రేక్షకులు ఇక చాలు అని ఫీలైన వెంటనే.. దర్శకత్వం పక్కన పెట్టేసి నటుడిగా మారిపోతానని కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు. దీంతో అనిల్ రావిపూడి కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా, `ఎఫ్ 3`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకుని సక్సెస్ జ్యోష్ లో ఉన్న అనిల్ రావిపూడి.. తన తదుపరి చిత్రాన్ని నటసింహం నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చింది. ఇది తండ్రీ కూతురు మధ్య సాగే కథ. ఇందులో బాలయ్య కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీల అలరించబోతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేశారట అనిల్ రావిపూడి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ మూవీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.