బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'బ్రహ్మాస్త్ర'. ఇందులో రణబీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటిస్తుండగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - కింగ్ అక్కినేని నాగార్జున - మౌనీ రాయ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో మూడు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోంది.
స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమాని నాలుగు దక్షిణాది భాషల్లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని తెలుగులో ''బ్రహ్మాస్త్రం: మొదటి భాగం-శివ'' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో 2022 సెప్టెంబర్ 9న ''బ్రహ్మాస్త్రం'' సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు...
* 'బ్రహ్మస్త్ర' సినిమాతో మీరు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు.?
౼ 'బ్రహ్మస్త్ర' సినిమా ద్వారా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ఫాంటసీ ఫిలిం చెయ్యాలనుకున్నపుడు నన్ను చాలా విషయాలు ఇన్స్పైర్ చేసాయి. మనదేశంలో ఉన్న సంస్కృతి, పురాణాలు, గొప్ప కథలను డైరెక్ట్ గా చెప్పకుండా నా పద్ధతిలో చూపించాను. మీరు ఈ సినిమాను చూస్తున్నప్పుడు మన దేశం యొక్క సోల్.. అలానే ఆధ్యాత్మికతను కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తారు.
* ఇందులో అమితాబ్ బచ్చన్ - అలియా భట్ - నాగార్జున సెలెక్షన్ మీదేనా..?
౼ నిజంగా చెప్పాలంటే కథను రాసుకున్నప్పుడే ఈ పాత్ర కోసం అమితాబ్ బచ్చన్.. ఈ పాత్ర కోసం అలియా.. అలానే ఈ పాత్ర కోసం నాగార్జున గారు కావాలి అనుకున్నాము. ఆయనకు కథను చెప్పాము.. బాగా నచ్చింది. ఈ పాత్రకు నాగార్జున గారు పర్ఫెక్ట్ అనిపించింది. 'బ్రహ్మాస్త్ర' చూస్తున్నప్పుడు ఇది మన సినిమా అనే అనుభూతి కలుగుతుంది.
* ఈ సినిమాను మీరు మోడ్రన్ మైథాలజీ అని ఎలా చెప్తారు?
౼ ఈ సినిమా మోడ్రన్ ఇండియా 2022 లోనే జరుగుతుంది. అంటే ఇది ప్రస్తుత సినిమానే. 'బ్రహ్మాస్త్ర' అనే టైటిల్ వినగానే కొంతమంది ఇది పీరియాడిక్ ఫిలిం అనుకుంటారు. కానీ కథ మాత్రం మోడరన్ ఫిలిం. ఈ సినిమాకి ఇన్స్పెరేషన్ ఇండియన్ మైథాలజీ. అందుకే దీనిని మోడరన్ మైథలాజి అని చెప్పాను.
* మూడు భాగాలుగా రానున్న 'బ్రహ్మాస్త్ర' లో ఫస్ట్ పార్ట్ గా 'శివ' ను తీసుకోవడానికి కారణం?
౼ వాస్తవంగా చెప్పాలంటే నిజంగా కనెక్షన్ అంటూ ఏమి లేదు. లార్డ్ శివ కి దేనినైనా సృష్టించడమే కాదు. తన మూడవ కన్నును తెరిస్తే, దేనినైనా నాశనం చేసే శక్తి కూడా ఉంది. ఈ కాన్సెప్ట్ లో బ్రహ్మాస్త్ర పవర్ ను ఎవరు కంట్రోల్ చెయ్యలేరు.
* మన పురాణాల్లో చాలామంది సూపర్ హీరోస్ ఉన్నారు. మీరు ముందుగా భారతీయ సినిమాకు వాళ్ళను పరిచయం చేస్తున్నారు. కానీ ఎందుకు ఇంత లేట్ అయింది?
౼ నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు చాలా త్వరగా చేసేయాలి అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు 10-20 సంవత్సరాల క్రితం రాసిన కామిక్ బుక్స్ ఆధారంగా తీసినవే. వాటితోనే అంత కంటెంట్ క్రియేట్ చేసి ఆదరణ పొందినప్పుడు. ఎన్నో గొప్ప గొప్ప కథలు - పురాణ ఇతిహాసాలు ఉన్న మన భారతీయ చరిత్రను యధార్ధంగా ఎందుకు చూపించలేం అనిపించింది. 2011 లో నాకు ఈ ఆలోచన వచ్చింది. అలానే అప్పటినుండి ఇప్పటివరకు టెక్నాలిజీ కూడా బాగా డెవలప్ అయింది. అది కూడా కొంతవరకు కలిసొచ్చింది.