తుఫాన్‌ సన్నివేశంలోనూ స్వయంగా వీరయ్య..!

Update: 2022-12-26 16:05 GMT
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్యాచ్ వర్క్‌ కూడా ముగింపు దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరో వైపు సినిమా యొక్క పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా ను సంక్రాంతి కానుకగా వచ్చే జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. ఇటీవల బాబీ ఫ్యాన్స్ ఇంట్రాక్షన్‌ లో  చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమాలోని వీరయ్య ఇంట్రడక్షన్ సన్నివేశాలు తుఫాన్ లో చిత్రీకరించాల్సి వచ్చింది. వర్షం భారీగా పడుతూ ఉండటంతో పాటు విపరీతమైన గాలి ఎఫెక్ట్‌ లో చిత్రీకరణ చేసినట్లుగా బాబీ పేర్కొన్నాడు.

ఆయన తల్చుకుంటే సీన్‌ షూటింగ్‌ మొత్తం కూడా డూప్ లో చేయవచ్చు. సన్నివేశం చివర్లో వచ్చి తన ఫేస్ ను చూపించవచ్చు. కానీ చిరంజీవి గారు మాత్రం మొత్తం సన్నివేశంలో తానే నటించారు. డూప్‌ అస్సలు అక్కర్లేదు అన్నారు. ఆయన తడి జుట్టుతో శరీరం మొత్తం తడిగా ఉన్నా కూడా చలిలో అలాగే షూటింగ్‌ లో పాల్గొన్నాడు. అందుకే ఆయన మెగాస్టార్‌ అయ్యారు అంటూ బాబీ కామెంట్స్ చేశారు.

ఇంకా ఈ సినిమా కోసం చిరంజీవి మూడు పదుల వయసు లో ఉన్న హీరోల మాదిరిగా తెగ కష్టపడ్డాడు. మంచు కురుస్తున్న చోట శ్రీదేవి చిరంజీవి పాట చిత్రీకరణ కోసం చిరంజీవి ఎంతగా కష్టపడ్డారో చూశాం. ఇప్పుడు సినిమాలో ఇంట్రడక్షన్ సన్నివేశం కోసం అంతే కష్టపడ్డట్లుగా బాబీ పేర్కొన్నాడు. ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా ఇంతగా కష్టపడటం కేవలం ఆయనకే చెల్లింది.

వాల్తేరు వీరయ్య సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్‌ నటించిన విషయం తెల్సిందే. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్‌ అందిస్తున్నాడు.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా మాస్ మసాలా ఎలిమెంట్స్ తో ఉండబోతుంది. రవితేజ ఈ సినిమాలో నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News