రవితేజ పవర్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన దర్శకుడు బాబీ ఆ వెంటనే పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను చేశాడు. రెండవ సినిమా తోనే అంతటి పెద్ద స్టార్ తో సినిమాను చేసే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత ఎన్టీఆర్ ను మూడు విభిన్న పాత్రలో చూపించిన ఘనత ఈయనకు దక్కింది. ప్రస్తుతం చిరంజీవితో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. చాలా తక్కువ సమయంలోనే పెద్ద స్టార్స్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్న ఈయనకు చాలా క్రితమే గంగోత్రి సినిమాలో నటించే అవకాశం వచ్చిందట.
గంగోత్రి సినిమా రచయిత చిన్నికృష్ణ అప్పట్లో బాబీని రాఘవేంద్ర రావు దగ్గరకు తీసుకు వెళ్లారు. ఆ సమయంలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. అయితే ఆ సినిమాలో నెక్కర్ వేసుకుని నటించాల్సి ఉంటుందని.. అందుకోసం నెక్కర్ చొక్కా కొలతలు ఇవ్వాలంటూ బాబీని సహాయ దర్శకుడు అడిగాడు. గుంటూరులో అందరు కూడా తనను నెక్కర్ లో చూసి నవ్వుతారేమో అంటూ ఆ పాత్రను నేను వద్దనుకున్నాను. నటించకుంటే మరేం చేస్తావంటూ చిన్ని కృష్ణ అడిగిన సమయంలో కథలు రాస్తాను అని చెప్పాడు. దాంతో గంగోత్రిలో కొన్ని సీన్స్ రాసే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలకు రచయితగా వ్యవహరించిన బాబీ దర్శకుడిగా మారాడు.
ఆ రోజు గంగోత్రి సినిమా కోసం నెక్కర్ వేసుకుని నటుడిగా సెటిల్ అయితే రచయితగా ఇంత పేరు వచ్చేది కాదు.. దర్శకుడిగా అవకాశాలు వచ్చేవి కాదు. చిన్ని కృష్ణ ఆధ్వర్యంలో ఈయన రాసిన పలు కథలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సొంతంగా కూడా ఈయన కథలు అందించిన సినిమాలు సక్సెస్ అయిన నేపథ్యంలో దర్శకుడిగా మొదటి సినిమాతోనే రవితేజను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ఇండస్ట్రీలో చాలా మంది రచయితలు దర్శకులుగా పేరు దక్కించుకున్నారు. వారిలో బాబీ ఒకరు. త్వరలో చేయబోతున్న మెగా స్టార్ మూవీ సక్సెస్ అయితే ఇక టాలీవుడ్ లో ఈయన రేంజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.