ఎంత స్పీడుగా స్టార్ హీరోయిన్ గా ఎదిగిందో... అంతే స్పీడుగా కిందకి పడిపోయి... అవకాశాల కోసం ఎదురుచూసే పరిస్థితిలో పడింది రకుల్ ప్రీత్. ఎన్నో అంచనాలతో ఆమె చేసిన స్పైడర్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో రకుల్ కి తెలుగులో ఆ తర్వాత ఒక్క అవకాశం కూడా రాలేదు. తమిళంలోనే ఒకటికి రెండు సినిమాలు చేస్తున్న రకుల్ కి ఎట్టకేలకు ఓ తెలుగు మల్టీస్టారర్ సినిమాకి పిలుపొచ్చినట్టు సమాచారం.
విక్టరీ వెంకటేష్ - నాగచైతన్య కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందబోతోంది. బయట మామా- అల్లుళ్లైన ఈ హీరోలు... తెర మీద కూడా ఇవే పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్. ఎన్ టీఆర్ తో జైలవకుశ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు బాబీ... ఈ మల్టీస్టారర్ రూపొందించబోతున్నాడు. ఈ సినిమాలో చైతూ జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకుంటున్నారట. నాగచైతన్య- రకుల్ జంటగా వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. అందుకే మరోసారి తన లక్కీ భ్రమరాంబ సరసన చిందేయాలని అనుకుంటున్నాడు నాగచైతన్య. దర్శకుడు బాబీ... ఇప్పటికే హీరోయిన్ రకుల్ ప్రీత్ కు కథ చెప్పాడని సమాచారం.
కథ విని పాజిటివ్ గా స్పందించిన రకుల్ ప్రీత్.. ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదట. అయితే పాపకు ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలేవీ లేకపోవడంతో కన్ఫార్మ్ చేయడం పక్కా అంటున్నారు. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. సురేష్ ప్రొడక్షన్స్- కోనా ఫిల్మ్ కార్పొరేషన్- పిపుల్ మీడియా ఫ్యాక్టర్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. జూన్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.