జూనియర్ ఎన్టీఆర్ నటనా కౌశలం గురించి.. అతడి జ్నాపక శక్తి గురించి తనతో పని చేసిన దర్శకులు.. నటీనటులు.. టెక్నీషియన్లు ఇప్పటికే చాలా చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఆ జాబితాలోకి దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబీ) కూడా చేరాడు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న బాబీ.. తన కథానాయకుడి గురించి ఓ వేడుకలో గొప్పగా చెప్పాడు. ఇప్పటిదాకా ‘జై లవకుశ’ షూటింగ్ లో ఒక్కటంటే ఒక్కసారి కూడా ఏ సన్నివేశాన్నీ రెండో టేక్ చేసే అవకాశమే ఎన్టీఆర్ తనకు ఇవ్వలేదని బాబీ తెలిపాడు.
‘‘జై లవకుశ కోసం ఇప్పటిదాకా 49 రోజుల దాకా షూటింగ్ చేశారు. 49 రోజుల్లో ఒక్కసారి కూడా వన్స్ మోర్ అని చెప్పే అవకాశం నాకివ్వలేదు తారక్. ప్రతి సీన్ కూడా ఒక్క టేక్ లోనే అవగొట్టేస్తున్నాడు. షాట్ పూర్తయి మానిటర్ వైపు చూసుకునే లోపే ఎన్టీఆర్ నవ్వుకుంటూ వెళ్లిపోతుంటాడు. అతను అన్ని విషయాల మీదా మంచి కమాండ్ ఉన్న నటుడు. తారక్ తో పని చేయడమే పెద్ద అచీవ్మెంట్ లాగా భావిస్తున్నాను. తారక్ గొప్ప డ్యాన్సర్ మాత్రమే కాదు. గొప్ప పెర్ఫామర్ కూడా. అతడి జ్నాపకశక్తి అమోఘం. నేనెప్పుడో మూడు నెలల కిందట కథ చెబితే.. అందులోని ఏ సీన్ అయినా సరే వెంటనే గుర్తు తెచ్చుకుని దాని గురించి వివరంగా చెబుతాడు’’ అంటూ తన హీరో మీద పొగడ్తలు గుప్పించాడు బాబీ. మరి ఎన్టీఆర్ గురించి ఇంతగా చెబుతున్న బాబీ.. అతడిని ఎలా ఉపయోగించుకున్నాడో.. ‘జై లవకుశ’ను ఎలా మలిచాడో చూడాలి. ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ‘జై లవకుశ’ సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.