కాటమరాయుడు ఫస్టాఫ్ ఎంటర్టయినింగ్ గా ఉన్నప్పటికీ.. సెకండాఫ్ లో మాత్రం పెద్దగా విషయం లేదంటూ బయట డివైడ్ టాక్ వచ్చేసింది. కొందరికి సెకండాఫ్ నచ్చితే.. కొందరికి బోర్ కొట్టేసింది. ఈ టాక్ పై ఇంతకీ దర్శకుడు డాలీ ఎలియాస్ కిషోర్ పార్దసాని ఎలా ఫీలవుతున్నాడు??
''కమర్షియల్ సినిమా ఫార్ములా ఏంటంటే.. మొదటి భాగంలో విపరీతమైన ఎంటర్టయిన్మెంట్ ఉంటుంది.. ద్వితీయార్ధంలో పూర్తిగా కథ ఉంటుంది. కాటమరాయుడులో కూడా అంతే. ఫస్టాఫ్ లో కేవలం ఎంటర్టయినింగ్ ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి కాని కథ లేదు. ఇక రెండో హాఫ్ లో పూర్తిగా కథను చెప్పాం. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమాలోనైనా ఇదే ఫార్ములా మామూలేగా. మేం కూడా అదే ఫాలో అయ్యాం'' అన్నాడు దర్శకుడు డాలీ. అలాగే ఈ సినిమాలో శృతి హాసన్ పై వస్తున్న క్రిటిసిజం గురించి స్పందిస్తూ.. ఆమె ఈ సినిమాలో చాలా అందంగా ఉందని చెబుతున్నాడు. గబ్బర్ సింగ్ తరువాత వీరి పెయిరింగ్ చాలా గ్రేట్ గా ఉందన్నాడు దర్శకుడు.
ఇక సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ వాకౌట్ చేశాడు అనే రూమర్ ను ఖండిస్తూ.. అసలు పవన్ కళ్యాణ్ అటువంటి పనులు చేయడని చెప్పాడు. ''పవన్ షూటింగులో చాలా జాలీగా ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అలాగే దర్శకుడి పనిలో ఆయన తలదూర్చరు. ఎంతో ఫ్రీడమ్ ఇస్తారు'' అంటూ పవన్ ను పొగిడేశాడు డాలీ. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/