అది రూమర్ అంటున్న విన్నర్ డైరెక్టర్

Update: 2019-08-29 07:41 GMT
మాస్ ఎంటర్టైనర్స్ కు కేరాఫ్ అడ్రెస్ ఆయిన గోపిచంద్ మలినేని నెక్స్ట్ సినిమా విషయంలో గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఒక టాక్ వినిపించింది.  గోపిచంద్ రీసెంట్ గా సీనియర్ హీరో అక్కినేని నాగార్జునను ఒక కథతో ఇంప్రెస్ చేశాడని..  నాగ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఆ వార్త సారాంశం. అయితే నాగ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో గోపిచంద్ తో ఒక మసాలా సినిమాను చేస్తాడని ఎవరూ అనుకోరు. అయినా ఈ వార్తలకు గోపిచంద్ స్పందించి తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

"నా నెక్స్ట్ ఫిలిం గురించి కొన్ని వెబ్ సైట్లలో కొన్ని ఊహాగానాలు వచ్చాయి. అదంతా అబద్దం. రవితేజ గారితో నా నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది.  త్వరలో ఇతర వివరాలు అప్డేట్ చేస్తాను. మేము సరైన సినిమాతో మీ ముందుకు మరోసారి రాబోతున్నాం" అంటూ ట్వీట్ చేశాడు.  దీంతో నాగార్జున-గోపిచంద్ మలినేని సినిమా వార్త జస్ట్ రూమరేనని తేలిపోయింది.  

అయితే గోపిచంద్ ఇంత క్లారిటీ ఇవ్వడానికి కారణం..  నాగార్జునతో సినిమా కోసం ట్రై చేస్తున్నాడనే వార్తలతో రవితేజకు రాంగ్ మెసేజ్ వెళ్తుందేమోనని.   గోపిచంద్ మలినేని లాస్ట్ సినిమా సాయి ధరమ్ తేజ్ తో చేసిన 'విన్నర్'. ఆ సినిమా తర్వాత రెండేళ్ళ ఖాళీగా ఉండాల్సి వచ్చింది.. ఫైనల్ గా గోపిచంద్ కు రవితేజతో సినిమా చేసే అవకాశం వచ్చింది.  ఈసమయంలో నాగ్ సినిమా రూమర్లతో రవితేజ ప్రాజెక్టుకే ఎసరు వస్తుందని భయపడినట్టున్నాడు.  అలాంటి వార్తలకు ముందే చెక్ పెడితే మంచిదనే ఉద్దేశంతో క్లారిటీ ఇచ్చాడు.


Tags:    

Similar News