‘విన్నర్’ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ సినిమా ఓ రేంజిలో ఆడేస్తుందని.. తనకు స్టార్ హీరోల దగ్గర్నుంచి ఆఫర్లు కూడా వస్తాయని ధీమాగా చెప్పాడు గోపీచంద్. ఐతే ‘విన్నర్’కు ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. రొటీన్ పాత చింతకాల పచ్చడి కథ అంటూ విమర్శకులు పెదవి విరిచారు. ప్రేక్షకుల నుంచి కూడా స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఈ చిత్రాన్ని పెద్దగా పోటీ లేకుండా భారీ స్థాయిలో రిలీజ్ చేయడం.. సినిమా మీద ముందు నుంచి హైప్ ఉండటంతో ఓపెనింగ్స్ ఆశాజనకంగానే కనిపించాయి. కానీ ఈ సినిమా మండే టెస్టులో పాస్ కాలేకపోయింది. కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి.
ఓవరాల్ గా ‘విన్నర్’ ఎంత కలెక్ట్ చేస్తుంది.. ఎలాంటి ఫలితాన్నందుకుంటుంది అన్నది పక్కనబెడితే.. ప్రేక్షకులకు అభిరుచి పూర్తిగా మారిపోయి కొత్త కథలకు పట్టం కడుతున్న సమయంలో ఇలాంటి సినిమా రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘ఘాజీ’ లాంటి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటే.. ఔట్ డేట్ అయిపోయిన కమర్షియల్ ఫార్మాట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు గోపీచంద్. ఇంతకుముందు అతను తీసినవి కూడా కొత్త తరహా సినిమాలేమీ కావు కానీ.. డాన్ శీను.. బలుపు లాంటి సినిమాలు మరీ అంత రొటీన్ సినిమాలేమీ కావు. ఆ సినిమాలు వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మరింతగా మారాయి.
‘పండగ చేస్కో’ గోపీచంద్ కు చేదు అనుభవాన్ని మిగిల్చినప్పటికీ.. అతనేమీ పెద్దగా మారలేదు. మళ్లీ ‘ఫార్మాట్’ సినిమానే తీశాడు. ప్రస్తుతం స్టార్ హీరోలు రొటీన్ కమర్షియల్ సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఈ తరహా కథల్ని నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. ఇంతకుముందు రొటీన్ మాస్ సినిమాలే చేస్తూ వచ్చిన రామ్ చరణ్ సైతం కొత్త కథలకే ప్రాధాన్యమిస్తున్నాడు. మిగతా హీరోలు ఆల్రెడీ భిన్నమైన బాటలో నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు గోపీచంద్ కోసం చూడటం సంగతలా ఉంచితే.. రామ్.. సాయిధరమ్ లాంటి మీడియం రేంజి హీరోలతో పని చేయడం కూడా కష్టమయ్యేలా ఉంది మలినేనికి. మరి అతడికి ఛాన్సిచ్చే హీరో ఎవరో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/