బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'జెర్సీ' ఇప్పటివరకూ ఎన్నిసార్లు వాయిదా పడిందో చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాదే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి. సెకెండ్ వేవ్ తగ్గింది. పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని భావించారు. దీంతో డిసెంబర్లో మంచి రిలీజ్ తేదీని కూడా చూసుకున్నారు. కానీ థియేటర్ ఆక్యుపెన్సీ దగ్గర వెనక్కి తగ్గారు. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా రిలీజ్ చేస్తే వసూళ్లు వస్తాయా? అని సందేహించారు.
అటుపై ఒక్కసారిగా థర్డ్ వేవ్ ఉవ్వెత్తున దూసుకొచ్చింది. మళ్లీ అన్ని బంద్ అయ్యే పరిస్థితులు. దీంతో ఏప్రిల్ వరకూ రిలీజ్ మాట ఎరుగని పరిస్థితి. ఏప్రిల్ 14న రిలీజ్ చేద్దామంటే పాన్ ఇండియా చిత్రం 'కేజీఎఫ్' హిందీలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుండటంతో 'జెర్సీ' 22కి వాయిదా పడింది. ఇలా 'జెర్సీ' వాయిదా పడటం వల్ల సినిమా పై బజ్ తగ్గినట్లు కొత్త ప్రచారం తెరపైకి వస్తుంది. సాధారణంగా వాయిదాల పసర్వం సినిమా పై కొంత నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తుంది.
వాయిదా అభిమానుల్ని నిరుత్సాహ పరుస్తుంది. మునపటి జోష్ కనిపించదు. ఓపెనింగ్స్ పైనా కొంత ప్రభావం పడుతుంది. కేవలం వాయిదా తో వచ్చే సాధారణ సమస్యలే ఇవన్నీ. ఎంత పెద్ద హీరో సినిమా అయినా వాయిదా పడితే ఇదే పరిస్థితి. ఆ మధ్య 'ఆర్ ఆర్ ఆర్' విషయంలోనూ ఇదే జరిగింది. అభిమానులు తీవ్ర నిరుత్సాహాన్ని వ్యక్తపరిచారు. కానీ ఫస్ట్ షో పడటం పాజిటివ్ టాక్ రావడంతో అన్ని ఒక్కసారిగా తొలగిపోయాయి. నీరసించిన అభిమానులు ఒక్కసారిగా థియేటర్ వైపు చూడటం మొదలు పెట్టారు.
'జెర్సీ' విషయంలోనూ అదే సన్నివేశం రిపీట్ అవ్వాల్సి ఉంటుంది. తొలి షో అనంతరం పాజిటివ్ టాక్ వస్తే పర్వాలేదు. టీమ్ సేఫ్ జో్ లోకి వెళ్లిపోయినట్లే. అయితే ఈ సినిమా సక్సెస్ అన్నింటికి మించి దర్శకుడు గౌతమ్ కి ఎంతో కీలకం అని తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ పైనే ఆర్ సీ 16 ఆధారపడిందని వెబ్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్ తో చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తదుపరి చరణ్ సినిమా అదే రేంజ్లో ఉండాలి.
శంకర్ తో తీస్తోన్నసినిమా విషయంలో ఢోకా లేదు. కానీ గౌతమ్ విషయంలో క్లారిటీ లోపించినట్లు వినిపిస్తోంది. 'ఆర్ ఆర్ ఆర్' సెట్స్ లో ఉండగానే చరణ్ గౌతమ్ స్ర్కిప్ట్ ని లాక్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పుడు చరణ్ ఆలోచనలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో గుస గస.
దానికి తోడు బాలీవుడ్ 'జెర్సీ' సక్సెస్ కాకపోతే గౌతమ్ ప్రాజెక్ట్ విషయంలో నీలి నీడలు కమ్ముకునే ఛాన్సెస్ ఉన్నాయన్నది కొంతమంది భావన. సక్సెస్ అయితే గనుక చరణ్ ఎర్ర తివాచీ వేసి మరీ ఆహ్వానిస్తారని..లేదంటే కొరటాల విషయంలో చోటు చేసుకున్న సన్నివేశమే రిపీట్ అవుతుందని సందేహం వ్యక్తం చేస్తున్నారు.