హ‌ను రాఘ‌వ‌పూడి వెంట బ‌డా సంస్థ‌లా?

Update: 2022-08-07 11:30 GMT
యంగ్ డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి పేరు మరోసారి టాలీవుడ్ లో మారు మ్రోగిపోతుంది. `సీతారామం`తో మ‌రో క్లాసిక్ హిట్ ని ఖాతాలో వేసుకోవ‌డంతోనే ఇది సాధ్య‌మైంది.  10 ఏళ్ల త‌ర్వాత వ‌చ్చిన స‌క్సెస్ ఇది. కెరీర్ ఆరంభంలో `అందాల రాక్ష‌సి` తో క్లాసిక్ హిట్ అందుకున్న హ‌ను ఆ త‌ర్వాత చేసిన ప్ర‌య‌త్నాలేవి ఫ‌లించ‌లేదు.

`అందాల రాక్ష‌సి` త‌ర్వాత నాలుగేళ్ల గ్యాప్ అనంత‌రం తెర‌కెక్కించిన `కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌` విమర్శ‌కుల ప్ర‌శంలందుకున్న చిత్రంగా నిలించింది గానీ కాసులు రాబ‌ట్ట‌లేక‌పోయింది. దీంతో మూడేళ్లు గ్యాప్ త‌ప్ప‌లేదు.  ఆ త‌ర్వాత నితిన్  హీరోగా `లై` చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇది డిజాస్ట‌ర్ గా తేలింది. అయినా ఈసారి అవ‌కాశం ఏడాది గ్యాప్ లోనే వ‌చ్చింది.

`లై `త‌ర్వాత శ‌ర్వానంద్ హీరోగా `ప‌డి ప‌డిలేచే మ‌న‌సు` తెర‌కెక్కించాడు. ఈ సినిమా కూడా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. దీంతో లాభం లేద‌నుకున్న హ‌ను ఏకంగా నాలుగేళ్లు స‌మ‌యం తీసుకుని `సీతారామం` తెర‌కెక్కించాడు. తెలుగు హీరోలు ఎవ‌రూ డేట్లు ఇవ్వ‌లేదా?  లేక ఆ క‌థ‌కి దుల్కార్ స‌ల్మాన్ మాత్ర‌మే యాప్ట్  అవుతాడ‌ని భావించాడో తెలియ‌దుగానీ..ప‌ర భాషా న‌టుడి తో తెలుగులో సినిమా చేసి  హిట్ కొట్ట‌డం అంటే చిన్న విష‌యం కాదు.

కానీ హ‌ను అది సాధించి చూపించాడు. వైవిథ్య‌మైన ప్రేమ కావ్యాలు తెర‌కెక్కించాలంటే? త‌న‌కే సాధ్య‌మ‌ని మ‌రోసారి నిరూపించాడు. త‌న క‌థ‌ని న‌మ్మి అశ్వీనీద‌త్ లాంటి నిర్మాత‌లు ముందుకు రావ‌డం తో సినిమా స్పాన్ పెరిగింది. క‌థ‌లో పాత్ర‌లు 100 శాతం న్యాయం చేయ‌డం. క‌థ‌ని ప‌క్కాగా ఎగ్జిక్యూట్ చేయ‌డం ఇలా వ‌రుస‌గా అన్ని క‌లిసొచ్చాయి.

మ‌రి ఇప్పుడైనా హ‌ను గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తాడా?  లేక  ప‌దేళ్ల క్రితం నాటి  హ‌నునే రిపీట్ చేస్తాడా? అంటే ఇక‌పై హ‌ను వేగంలో మార్పులు త‌ధ్య‌మ‌నిపిస్తుంది. `సీతారామం` సక్సెస్ చూసిన బ‌డా నిర్మాణ సంస్థ‌లు ఇప్పుడు హ‌ను వెంట ప‌డు తున్నాయ‌ని  స‌మాచారం. ఇప్ప‌టికే  మైత్రీ మూవీ మేక‌ర్స్  అడ్వాన్స్ చెల్లించి త‌మ బ్యాన‌ర్లో లాక్ చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు లీకులందాయి.

అలాగే  సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్..గీత ఆర్స్ట్ లాంటి సంస్థ‌లు సైతం డైరెక్ట‌ర్ కి  అడ్వాన్స్ లు చెల్లిస్తే ఎప్పుడైనా సినిమా చేయోచ్చు అన్న ఆలోచ‌న‌తో ముందుకు క‌దులుతున్నాయ‌ట‌. ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల అభిరుచుల్లో ఎన్నో మార్పులొచ్చాయి.  కంటెంట్ ప‌రంగా  వైవిథ్య‌ని కోరుకుంటున్నారు. థియేట్రిక‌ల్ గా రాణించ‌ని సినిమాలు కొన్ని ఓటీటీ లో పెద్ద విజ‌యం సాధిస్తున్నాయి. హ‌నురాఘ‌వ‌పూడి లాంటి ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ తో వండ‌ర్స్ చేయ‌డానికి ఛాన్స్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే బ‌డా సంస్థ‌లు ముందుగానే  క్యూ క‌డుతున్నాయా అన్న సందేహం రాక మాన‌దు.
Tags:    

Similar News