కరోనా ఎఫెక్ట్ నుండి సినీ ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై ఏడాది చివరి వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర పరిశ్రమ మూత పడడంతో నిర్మాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వడ్డీలకు డబ్బులు తెచ్చి సినిమాలను నిర్మించిన నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో నిర్మాతలు విరివిగా డబ్బులు ఖర్చు చేసి సినిమాలు తీసే పరిస్థితి కనిపించడం లేదు. ఇకపై బడ్జెట్ విషయంలో కచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా కరోనా ప్రభావం తగ్గి లాక్ డౌన్ ఎత్తేసినా జనాల్ని థియేటర్లకు రప్పించడం అంత తేలికైన విషయం కాదని చెప్పవచ్చు. దీంతో నిర్మాత పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అందువల్ల ఇప్పటి నుంచి నిర్మాతలు ఆచితూచి అడుగులు వేసే ఛాన్స్ ఉంది. ఇకపై ఖచ్చితంగా ఖర్చు తగ్గించుకునే మార్గాలని వెతుక్కోవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు.
అంతేకాకుండా సినిమా బడ్జెట్ లో కోతలు ఉండబోతున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సాధారణంగా సినిమా బడ్జెట్ లో ఎక్కువ భాగం డైరెక్టర్, టెక్నీషియన్స్ హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ కే కేటాయిస్తున్నారు. దీంతో ముఖ్యంగా భారీ రెమ్యూనరేషన్ తీసుకునే వీళ్లు పారితోషకాల్లో కోతలు విధిస్తే నిర్మాత అంతో ఇంతో కోలుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంత మంది హీరోలు, డైరెక్టర్లు స్వచ్ఛందంగా పారితోషికాలను తగ్గించుకుంటున్నారు. ఇప్పటికే 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ తన తదుపరి ప్రాజెక్ట్ ల కోసం 25 శాతం పారితోషికం తగ్గించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా స్టార్ డైరెక్టర్ హరి కూడా ముందుకొచ్చారు. తను చేయబోయే తదుపరి సినిమాకు 25 శాతం పారితోషికం తగ్గించుకున్నట్లు ఒక లేఖ ద్వారా హరి వెల్లడించాడు. ఈ నేపథ్యంలో తమిళ హీరోలు డైరెక్టర్ల లాగే మన స్టార్ హీరోలు డైరెక్టర్లు టెక్నిషియన్స్ వారి రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుంటే సినిమా బడ్జెట్ లో సగం సేవ్ అయినట్లేనని.. నిర్మాతలు కొంతమేర బయటపడే అవకాశాలుంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇదిలా ఉండగా సూర్య - హరి కాంబినేషన్ లో ‘అరువా’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశీఖన్నా ఖరారైంది. సూర్య - డైరెక్టర్ హరి కాంబినేషన్ లో వస్తున్న ఆరో సినిమా ఇది. ‘సింగం’ సిరీస్ లో మూడు సినిమాలు, ‘ఆరు’, ‘దేవా’ సినిమాలతో కలిపి మొత్తంగా ఐదు సినిమాలకు వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఇప్పుడు రాబోతున్న ‘అరువా’ సినిమాపై భారీ అంచనాలే నెలకొనియున్నాయి.