ఐఏఎస్ - ఐపీఎస్.... లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేయాలనుకుంటున్నా! అంటూ `నువ్వు నాకు నచ్చావ్`లో వెంకీ పేల్చిన డైలాగ్ ని మరోమారు గుర్తు చేసుకోవాల్సొచ్చింది. ఈ యంగ్ డైరెక్టర్ వాలకం అలానే ఉంది మరి. ఐఏఎస్ - ఐపీఎస్ - డాక్టర్లు ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ అవ్వాలని కలలుగంటున్నాడు. రంగుల ప్రపంచంలో తనకో పేజీ ఉందని ఆశిస్తున్నాడు. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే `హుషారు` దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. ఏదో ఆకతాయిగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది. సీరియస్ గానే తీసుకున్న నిర్ణయం. మనకు నచ్చనిది చేసే కంటే - నచ్చినది చేసి సంతోషంగా ఉండడం బెటర్ అని నమ్మే బాపతు. ఈరోజుల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలేం చేస్తాం. అక్కడ ఉన్నోళ్లంతా ఫ్రస్టేషన్ లోనే బతికేస్తారని అంటున్నాడు. అలాంటి బతుకు నేను బతకలేనని ఖరాకండిగా తేల్చి చెప్పాడు. నాన్న బలవంతంగా చదువును రుద్దినా - అమ్మ మాత్రం కెమెరా కొనిచ్చి సినిమాలు తీసుకోమని ఎంకరేజ్ చేసిందని - తనతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బోలెడన్ని సినిమాలు చూశానని ఈ కుర్రాడు చెబుతున్నాడు.
నలుగురు కుర్రాళ్ల కథతో తెరకెక్కిన హుషారు కథలో తన జీవిత కథ 80శాతం ఉంటుందని గ్యారెంటీ ఇచ్చాడు. సినిమా తీస్తున్న క్రమంలోనే గూగుల్ లో సెర్చ్ చేసి మరీ లక్కీ మీడియా నిర్మాతను కలిశాడట. ఈ బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని బయటపడేస్తున్నారు. డిసెంబర్ 7న మూవీ విడుదలకానుంది. శ్రీహర్ష మాట్లాడుతూ- హైదరాబాద్ లోనే పుట్టి పెరిగా. చిన్నప్పటి నుంచీ కథలు రాయడం - సినిమాలు చూడడం ఇష్టం. అందుకు అమ్మ నుంచి సపోర్టు దక్కింది. బి.టెక్ చదువుతున్న టైమ్ లో మా అమ్మ ఒక చిన్న కెమెరా కొని గిఫ్ట్ గా ఇచ్చింది. దాంతోనే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను. అటుపై ఫిలిమ్ మేకింగ్ పై మాత్రం నాకు బాగా ఆసక్తి కలిగింది. కానీ మా ఇంట్లో వాళ్ల బలవంతం మీద సివిల్స్ కోచింగ్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అక్కడే ఈ హుషారు స్క్రిప్ట్ రాశాను. సివిల్స్ కోచింగ్ సమయంలోనే ఎలాంటి టెన్సన్ లేకుండా రిలాక్స్ గా ఈ స్క్రిప్ట్ రాసుకున్నాను. చిన్నప్పటినుంచీ కలిసి పెరిగిన ఓ నలుగురు స్నేహితులకు సంబంధించిన కథ ఇది. నలుగురు కలిసి ఉంటే ఏదైనా చెయ్యొచ్చు.. తరహా కథాంశమిది... అని చెప్పాడు.
మొత్తానికి నచ్చింది చేయాలన్న పంతంతోనే మారుతి లాంటి దర్శకుడు హైదరాబాద్ కి వచ్చి సక్సెసైన సంగతి తెలిసిందే. ఈరోజుల్లో సినిమాతో మారుతి హిట్ కొట్టి - అటుపై కెరీర్ ని టర్న్ తిప్పిన వైనం ఎందరికో స్ఫూర్తి. అయితే ఇప్పుడు అదే బాటలో మనోడు కూడా వెళుతున్నాడా? అన్న సందేహం కలుగుతోంది. యూత్ లో పక్కా బ్యాడ్ బిహేవియర్.. బీర్లు తాగే గుంపు మీద సినిమా తీశాడు. అంతా అల్లరల్లరి.. ఆకతాయిగా పనులతో తీసిన ఈ సినిమా అతడికి హిట్టిస్తుందో లేదో చూడాలి. ఇది ఓన్లీ స్కూల్ - కాలేజ్ కుర్రాళ్లకు ఎక్కే సినిమా అని ఇదివరకూ రిలీజ్ చేసిన టీజర్ - పోస్టర్లు చెబుతున్నాయి. ఐఏఎస్ - ఐపీఎస్ అంటూ ట్రై చేసి చివరికి దర్శకుడవ్వాలన్న కల నెరవేరుతుందా.. నెరవేరదా .. వెయిట్ అండ్ సీ..