హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టీన్ కామ లీలల గురించిన వార్తలు నెల రోజులుగా పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. అతడి లీలల గురించి రోజుకో కొత్త కబురు బయటికి వస్తోంది. పదుల సంఖ్యలో హీరోయిన్లు అతడిపై ఆరోపణలు చేశారు. ఆస్కార్ కమిటీ నుంచి హార్వీని తొలగించడంతో పాటు అతడిపై న్యాయపరమైన చర్యలకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఈ వ్యవహారం ఇలా నలుగుతుండగానే మరో ప్రముఖ సీనియర్ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ టొబాక్ పై భారీ ఎత్తున లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. టొబాక్ తమను లైంగికంగా వేధించినట్లు, చాలా అసభ్యంగా ప్రవర్తించినట్లు ఒకేసారి 38 మంది మహిళలు మూకుమ్మడిగా ఆరోపణలు చేయడం విశేషం.
ఈ మహిళలందరూ కలిసి ‘లాస్ ఏంజెల్స్ టైమ్స్’ వార్తా సంస్థను కలిసి టొబాక్ మీద ఆరోపణలు చేశారు. ‘బగ్సీ’ సినిమాకు గాను స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన టొబాక్.. తనతో కలిసి పని చేసేందుకు వచ్చిన మహిళల్ని తీవ్ర స్థాయిలో వేధించేవాడని ఆ వార్తా సంస్థ పేర్కొంది. వీధుల్లో కనిపించిన మహిళల్ని కూడా అతను వదిలేవాడు కాదని.. స్టార్ హోదా కల్పిస్తానంటూ హామీ ఇచ్చి లొంగదీసుకునే ప్రయత్నం చేసేవాడని తెలిపింది. మహిళలు తనను కలవడానికి వచ్చినపుడు అసభ్యకరమైన ప్రశ్నలు వేసేవాడని.. వారి ముందు లైంగిక చర్యలకు దిగేవాడని లాస్ ఏంజెల్స్ టైమ్స్ వెల్లడించింది. ఐతే ఈ 38 మంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నేరుగా తమ వద్దకు వచ్చినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఐతే ఈ సంస్థ చెబుతున్న 38 మంది మహిళల్లో ఏ ఒక్కరినీ తాను కలవనే లేదని.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని 72 ఏళ్ల టొబాక్ అన్నాడు.