ఉస్మానియా స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'జార్జ్ రెడ్డి' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఏబీవీపీ కార్యకర్తలను రౌడీలుగా చిత్రీకరించారు అంటూ బీజేపీ నాయకులు మరియు ఏబీవీపీ నాయకులు అంటున్నారు. జార్జ్ రెడ్డిపై 15 కేసులు ఉన్నాయి. రౌడీ షీట్ ఉంది. వాటిని చూపించకుండా ఆయన్ను హీరోగా చూపిస్తూ ఏబీవీపీ నాయకులు ఆయన్ను హత్య చేసినట్లుగా.. ఏబీవీపీ నాయకులు విలన్స్ అన్నట్లుగా చూపించేందుకు ప్రయత్నిస్తే మాత్రం సీరియస్ పరిణామాలు ఉంటాయంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా హెచ్చరించాడు.
ఈ నేపథ్యంలో దర్శకుడు జీవన్ రెడ్డి స్పందించాడు. మీడియాతో మాట్లాడిన ఆయన ఒక గొప్ప స్టూడెంట్ లీడర్ సినిమాను తీశాం. దీంట్లో ఎవరిని తప్పుబట్టలేదు. వివాదం అస్సలు లేదు. ఈ సినిమా విషయమై నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికైనా చెప్పాలి ఉంటే అది కేవలం జార్జ్ రెడ్డి గారి తల్లికి మాత్రమే నేను సమాధానం చెప్తానంటూ జీవన్ రెడ్డి అన్నాడు.
రేపు రాజా సింగ్ తో కలిసి సినిమా చూసేందుకు నేను సిద్దంగా ఉన్నట్లుగా జీవన్ రెడ్డి పేర్కొన్నాడు. సినిమా గురించి ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా.. ఇబ్బంది ఉన్నా వారికి నేను సమాధానం చెప్తాను అంటూ ఈ సందర్బంగా జీవన్ రెడ్డి అన్నాడు.