తెలుగు చిత్ర పరిశ్రమలో అందరి నోట్లో నానుతున్నాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల. తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ కంట్లో పడ్డ అతను.. తాజాగా నాగార్జున.. నాగచైతన్యలతో కలిసి 'బంగార్రాజు' మూవీకి దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఆయన.. ఇప్పుడు చాలా యాంగ్జైటీతో ఉన్నారు.అనూహ్యంగా సంక్రాంతి రేసులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీకి సంబంధించిన పనుల్ని వాయువేగంతో నిర్వహిస్తున్నారు. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తే.. నాగచైతన్యకు జోడీగా క్రతిశెట్టి నటించింది.
తన తొలిచిత్రం సోగ్గాడే చిన్ని నాయనాతో అందరిని ఆకర్షించిన కల్యాణ్ కృష్ణ తర్వాత కాస్తంత వెనుకబడినట్లే చెప్పాలి. తాజాగా అతడి బంగ్రారాజు ఫలితంఎలాఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అన్నింటికి మించిన ఈ సినిమాను చాలా తక్కువ రోజుల్లో కంప్లీట్ చేస్తే.. అనుకోనిరీతిలో రిలీజ్ డేట్ ను ఫిక్సు చేయటంతో ఉరుకులుపరుగులతో సినిమాను పూర్తి చేశారు. ఒకవైపు కరోనా.. మరోవైపు లాక్ డౌన్ వేళలోనూ ఈ సినిమాను పూర్తి చేశారు. ఈ మూవీలో ఏకంగా 35 నిమిషాల పాటు గ్రాపిక్స్ న్నటల్ు చెబుతున్నారు.
గత ఏడాది ఆగస్టులో షూట్ ను స్టార్ట్ చేసి.. సంక్రాంతికి విడుదలచేయాలని అనుకున్నారు. కానీ..'ఆర్ఆర్ఆర్' తోపాట.. ప్రభాస్ రాధే శ్యామ్ నేపథ్యంలో ఈసినిమాను విడుదల చేయాలా? వద్దా? అన్న మీమాంసలో ఉన్నారు.ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ విడుదలకు వెనక్కి వెళ్లిందో.. సంక్రాంతి రేసుల్లోకి వచ్చేశాడు బంగ్రారాజు. ఈ చిత్ర ప్రమోషన్ ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు షాకింగ్ నిజాన్ని చెప్పుకొచ్చాడు.
సోగ్గాడే చిన్ని నాయనా తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు.. తాను ఎదుర్కొన్న అనేక ఒడిదొడుకులు కారణంగా.. సినిమాల్ని వదిలేద్దామన్న ఆలోచన తనకు వచ్చిందన్నారు. అయితే.. ఇంట్లోని వారు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారని.. ఈ సందర్భంగా నాగార్జున తనకెంతో సపోర్టుగా నిలిచినట్లు చెప్పారు. 'నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోకు' అంటూ ఆయన చెప్పిన మాటలే.. తానీ రోజున బంగర్రాజు మూవీ చేసే అవకాశాన్నిఇచ్చినట్లు చెప్పారు. తర్వాతి సినిమాకు ఇప్పటికే ఓకే చెప్పేసిన కల్యాణ్ కృష్ణకు సంక్రాంతి ఒక స్వీట్ గిఫ్టుగా మారాలని భావిద్దాం. ఆయన ఎదుర్కొన్న సమస్యలు తాజా విజయంతో మళ్లీ రాకూడదని కోరుకుందాం.