కాశీలో క్రిష్ ఏం చేస్తున్నారు

Update: 2017-05-04 07:14 GMT
సంక్రాంతి పండ‌గ రేసులో నిలవ‌ట‌మే కాదు.. బాల‌య్య కెరీర్‌ లో కీల‌క‌మైన సినిమాను గ్రాండ్ స‌క్సెస్ చేసి.. టాలీవుడ్‌ నే కాదు బాలీవుడ్ దృష్టిని సైతం ఆక‌ర్షించారు క్రిష్‌. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి త‌ర్వాత మ‌రే చిత్రాన్ని ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ.. ఆయ‌న హిందీలో తీసే ఝూన్సీ ల‌క్ష్మిభాయ్ ఎపిక్‌ ను తీసేందుకు ప‌క్కా ఏర్పాట్లు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణితో ఘ‌న విజ‌యాన్ని సాధించిన క్రిష్‌.. బాహుబ‌లి మూవీతో భార‌త చ‌ల‌న‌చిత్ర‌ప‌రిశ్ర‌మ క‌లెక్ష‌న్ రికార్డుల్ని తిర‌గ‌రాసిన ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ అందించిన క‌థ‌తో మ‌ణిక‌ర్ణిక పేరుతో తాజా మూవీని ప్లాన్ చేశారు. హిందీలో తీసే ఈ మూవీలో లీడ్ క్యారెక్ట‌ర్‌ను కంగ‌నా రౌన‌త్ చేయ‌నుంది. కొద్ది రోజులుగా ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ ను వేగంగా చేస్తున్న క్రిష్ అండ్ టీం.. తాజాగా కాశీకి చేరుకున్నారు.

ఝూన్సీ ల‌క్ష్మిభాయ్ కాశీలో పుట్టిన నేప‌థ్యంలో.. త‌మ సినిమాను అధికారికంగా అక్క‌డే అనౌన్స్ చేస్తే ఎమోష‌నల్ గా బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. సినిమాను అనౌన్స్ మెంట్ కు ద‌ర్శ‌కుడు క్రిష్ తో పాటు.. హీరోయిన్ కంగ‌నా కూడా కాశీకి చేరుకున్నారు. సినిమాను ఈ రోజు అధికారికంగా అనౌన్స్ చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా లక్ష్మిభాయ్ లుక్ లో ఉన్న కంగ‌నా 20 అడుగుల పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. అంతేకాదు.. సాయంత్రం ద‌శాశ్వ‌మేథ్ ఘాట్‌ లో జ‌రిగే గంగా హార‌తిలో యూనిట్ స‌భ్యులు పాల్గొన‌నున్నారు.  బాలీవుడ్ నిర్మాత క‌మ‌ల్ జైన్ నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి మ్యూజిక్ శంక‌ర్ ఇషాన్ లాయ్ అందిస్తుండ‌గా.. మాట‌ల్ని ప్ర‌సూన్ జోషి ఇవ్వ‌నున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News