ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో ప్రాజెక్ట్ కు సైన్ చేయబోతున్నారనే ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభాస్ టాలీవుడ్ దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయడానికి రెడీగా ఉన్నారని.. RRR ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య మరియు 'ఆచార్య' నిర్మాత నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారనేది ఈ వార్త సారాంశం.
ఇది హారర్ కామెడీ జానర్ లో ఉంటుందని.. ‘రాజా డీలక్స్’ అనే క్యాచీ టైటిల్ పరిశీలనలో ఉందని ఊహాగానాలు వచ్చాయి. పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్.. మధ్యలో కాస్త గ్యాప్ చూసుకుని మారుతి మూవీని కంప్లీట్ చేస్తారని సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొట్టాయి.
ప్రభాస్ - మారుతి వంటి అరుదైన కాంబినేషన్ పేరు వినగానే సినీ అభిమానులు ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారు. ఇప్పటి వరకు ఏ పెద్ద హీరోని హ్యాండిల్ చేయని మారుతీతో ప్రభాస్ ఎలా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని డార్లింగ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఇందులో నిజమెంతని ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో 'రాజా డీలక్స్' సినిమా వార్తలపై మారుతి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
''నా ఫ్యూచర్ ప్రాజెక్ట్లు - టైటిల్స్ - జానర్లు - మ్యూజిక్ డైరెక్టర్స్ మరియు సిబ్బంది.. మొదలైన వాటి గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ కాలమే అన్నీ వెల్లడిస్తుంది. మీ మద్దతు మరియు ప్రోత్సాహానికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి.. మాస్క్ ధరించి సురక్షితంగా ఉండండి'' అని మారుతి ట్వీట్ లో పేర్కొన్నారు.
అయితే మారుతి ట్వీట్ ప్రభాస్ తో సినిమాపై క్లారిటీ ఇవ్వకపోగా.. డార్లింగ్ ఫ్యాన్స్ ని మరింత కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. ఎందుకంటే ట్వీట్ లో ఎక్కడా ప్రభాస్ తో సినిమా చేయడం లేదని చెప్పలేదు.. అలాగని ప్రాజెక్ట్ ఉంటుందని కూడా కన్ఫర్మ్ చేయలేదు. మరి మారుతి డిప్లొమాటిక్ ట్వీట్ వ్యూహాత్మక మౌనమని అనుకోవాలేమో అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.