కామెడీ ఎంటర్ టైనర్ లకు కేరాఫ్ అడ్రెస్ అయిన మారుతి తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో 'ప్రతిరోజూ పండగే' సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా నిన్న శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందు మంచి హైప్ ఉన్నప్పటికీ అంచనాలు మాత్రం అందుకోలేకపోయింది. సూపర్ హిట్ టాక్ వస్తుందనుకుంటే మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
దీంతో మారుతి ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడనే అంటున్నారు. జీఎ2 పిక్చర్స్-యూవీ లాంటి బ్యానర్లు.. ఎనర్జిటిక్ మెగా హీరో.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. రాశి లాంటి హీరోయిన్.. సీనియర్ నటీనటులు అందరూ ఉన్నప్పటికీ దర్శకుడు మారుతి మాత్రం అందరినీ ఎఫెక్టివ్ గా వాడుకోలేకపోయాడు. సెకండ్ హాఫ్ లో తడబడ్డాడు. చావు మీద కామెడీ కూడా కొన్ని సీన్లలో ఎబ్బెట్టుగా ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. "నాన్నా నువ్వెప్పుడు పోతావ్" అని కొడుకు అనడం అందరూ డైజెస్ట్ చేసుకునే అంశం కాదని కొందరు విమర్శిస్తున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే 'ప్రతిరోజూ పండగే' రిలీజ్ టైమింగ్ భలే కుదిరింది. పోటీలో రిలీజ్ అయిన సినిమాలలో 'రూలర్' కు ఎలాగూ బ్యాడ్ టాక్ వచ్చింది. మిగతా రెండు సినిమాల హడావుడి కూడా పెద్దగా లేదు. మారుతి - తేజు సినిమానే అందరికీ ఫస్ట్ ఛాయిస్ గా ఉంది. 'వెంకీమామ' రిలీజై వారం రోజులు కావడంతో ఆ సినిమా హవా తగ్గింది. త్వరలో రిలీజ్ కాబోయే వాటిలో భారీ సినిమాలు కూడా లేవు. ఇలాంటి పరిస్థితిలో 'ప్రతిరోజూ పండగే' సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చి ఉంటే బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపి ఉండేదని.. ఇప్పుడు యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకోవలసిందేనని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే మారుతి-తేజు ఇద్దరూ సగం పండగతోనే సరిపెట్టుకోవలసిన పరిస్థితి అనే సెటైర్లు కూడా పడుతున్నాయి.