మా సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్.. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా.. మహిళలు, పిల్లలకు విపరీతంగా నచ్చుతుంది.. అని దర్శకులు, నిర్మాతలు స్టేట్మెంట్లివ్వడం చూస్తుంటాం. కానీ నా సినిమాలు కుటుంబ సమేతంగా చూడకండి. అసలు మహిళలు, పిల్లలు నా సినిమాలకు రావొద్దు అనే డైరెక్టర్ ఎవరైనా ఉంటారా? ఏదైనా బి-గ్రేడ్ సినిమా డైరెక్టర్ ఈ మాటంటే ఆశ్చర్యం లేదు. కానీ తమిళంలో సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ ఈ మాటలన్నాడు. అతనెవరో కాదు.. మిస్కిన్.
తెలుగులో ఈ మధ్యే ‘పిశాచి’ అనే సినిమా వచ్చింది చూశారూ.. ఆ సినిమా తీసింది మిస్కినే. అంతకుముందు మంచు మనోజ్ సినిమా ‘రాజుభాయ్’కి మాతృక అయిన ‘చిత్తిరం పేసిదడీ’తో దర్శకుడిగా పరిచయమయ్యాడతను. జీవా హీరోగా తెరకెక్కిన ‘మాస్క్’ కూడా అతడి సినిమానే. మిస్కిన్ సినిమాలంటే అదోలా ఉంటాయి. చాలా డిఫరెంటుగా తీస్తాడని పేరు. అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది తమిళనాట.
ఐతే తరచుగా సెన్సేషనల్ కామెంట్లు చేస్తుంటాడు మిస్కిన్. ఈ మధ్య మణిరత్నం, కమల్ హాసన్ లను విమర్శించి వార్తల్లోకెక్కాడు. ఇప్పుడు తన సినిమాలకు మహిళలు, పిల్లలు రావొద్దని మరో డేరింగ్ స్టేట్ మెంట్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమా అంటే పెద్దల కోసమే తీస్తారని.. అలాంటి సినిమాల్ని కుటుంబ సమేతంగా చూడాలనుకోవడం ఏంటని అతను ప్రశ్నించాడు. పిల్లలతో కలిసి సినిమా చూడాలనుకుంటే ఏ యానిమేటెడ్ సినిమాలకో, లేదంటే పిల్లల సినిమాలకో వెళ్లాలని.. డైరెక్టరుగా తాను అనుకున్న భావం తెరమీదికి రావడానికి కొన్నిసార్లు అసభ్యకరమైన పదాలు వాడటానికి, సన్నివేశాలు తీయడానికి వెనుకాడనని.. తన తర్వాతి సినిమాకు సెన్సార్ బోర్డు తప్పకుండా ‘ఎ’ సర్టిఫికెట్ ఇస్తుందని.. పిల్లలు, మహిళలు ఆ సినిమాకు రావద్దని కరాఖండిగా చెప్పేశాడు మిస్కిన్. తమిళనాట తమిళ పేర్లు పెట్టుకుని, యు సర్టిఫికెట్ వచ్చే సినిమాలకు పన్ను మినహాయింపు ఉంది. కానీ మిస్కిన్ అలాంటి మినహాయింపుల కోసం చూడకుండా తనకు నచ్చినట్లు సినిమాలు తీస్తుంటాడు.