టాలీవుడ్ సీనియర్ దర్శకుడు వి.వి.వినాయక్ త్వరలో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఆయన రూపం మారింది. ఫిజికల్ గా లుక్ కూడా మార్చేస్తున్నారు. అందుకోసం నిరంతరం జిమ్ముల్లో శ్రమిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేదెపుడు.. అన్నదానికి తాజాగా ఓ సమాచారం అందింది.
అక్టోబర్ 9న దర్శకుడు వి.వి.వినాయక్ పుట్టినరోజు జరగనుంది. అదే రోజున ఆయన కథానాయకుడిగా పరిచయం కానున్న చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచ్ కానుందని తెలుస్తోంది. పుట్టినరోజుకు తోడు విజయదశమి పండుగ ఘడియలు కలిసి వస్తుండటంతో ఆరోజు ఠెంకాయ కార్యక్రమం చేస్తున్నారట. ఈ సినిమాలో ఇతర నటీనటులెవరు.. దర్శకులెవరు అన్నది ఆరాతీస్తే.. చాలా సంగతులే తెలిసాయి.
వినాయక్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తున్నది ఎవరు అంటే... భారీ బడ్జెట్లతో పాన్ ఇండియా చిత్రాల్ని తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ శంకర్ శిష్యుడు ఎన్. నరసింహారావు దర్శకత్వం వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో పాత్ర కోసమే వినాయక్ జిమ్ లో చెమట చిందుస్తున్నారు. బరువు తగ్గుతున్నారు. 1980 నేపథ్యంలో సాగే ఈ కథాంశాన్ని ఎంచుకున్నారు. అలాగే వినాయక్ వయసుకు తగ్గట్టు పాత్ర తీరుతెన్నులు ఉంటాయని తెలుస్తోంది.
ఇంకాస్త డీప్ గా వెళితే.. `దిల్` సినిమాతోనే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత ఫేట్ మారింది. డెబ్యూ నిర్మాతగా ఆయనకు కొత్త మలుపు అయ్యింది ఆ చిత్రం. అందుకే సెంటిమెంటుగా వినాయక్ ని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ `ఆది` సినిమాతో దర్శకుడు అయిన వినాయక్ అటుపై దిల్ - చెన్నకేశవ రెడ్డి- ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్లకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కెరీర్ లో ఎన్నో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చి సెన్సేషనల్ దర్శకుడిగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఠాగూర్- ఖైదీనంబర్ 150 లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఆది- అదుర్స్ లాంటి బ్లాక్ బస్టర్లను ఇచ్చారు. అల్లు అర్జున్ కి బన్ని... చరణ్ కి నాయక్ లాంటి బ్లాక్ బస్టర్లను అందించారు.