నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్నని కన్నడ ఇండస్ర్టీ నుంచి బ్యాన్ చేయాలంటూ మీడియాలో కథనాలు వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్ మీడియాతో రష్మిక తన డెబ్యూ మూవీ గురించి చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఆమెని బ్యాన్ చేయాలంటూ ఇండస్ర్టీలో వార్తలు వినిపించాయి. దీనిపై లోలోపల పెద్ద ఎత్తున చర్చే సాగింది.
మాతృభాషని వదులకుని పరభాషల్లో రాణిస్తున్న నటికి ఇంత అహకారమా? కోట్ల రూపాయాలు పారితోషికం అందుకోవడంతో విధానం మారిపోయిందా? గతం మర్చిపోయావా? రష్మిక అంటూ నెటి జనులు సోషల్ మీడియాలో మండిపడ్డారు. తాజాగా ఈ వివాదం గురించి ''గుర్తుందా శీతాకాలం' దర్శకుడి వద్ద ప్రస్తావించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
'ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం అన్నది తప్పే. నేను కూడా సంజు వెడ్స్ గీత సినిమా కోసం చాలా మంది నటులకు ఛాన్స్ ఇచ్చాను. వాళ్లు అది గుర్తుపెట్టుకున్నారా? లేదా? అన్నది వాళ్లమీద అధారపడి ఉంటుంది. అదంతా వాళ్ల వ్యక్తిగత విషయం. నేను అయితే ఇలాంటివి పెద్దగా పట్టించుకోను. ఎదుటవాళ్ల నుంచి కృతజ్ఞతా భావాన్ని కోరుకున్నప్పుడే మనం బాధపడతాం.
రష్మిక విషయానికి వస్తే దీని గురించి పెద్దగా ఐడియా లేదు. కానీ రష్మికని బ్యాన్ చేస్తే గనుక అది పరిశ్రమకే నష్టం. ఇలాంటి వాటిని నేను సపోర్ట్ చేయను' అని అన్నారు. నిజమే రష్మికని బ్యాన్ చేస్తే నష్టపోయేది కన్నడ ఇండస్ర్టీనే. అక్కడ బ్యాన్ చేసారు? అని ఇతర పరిశ్రమలకు అవకాశాలివ్వకుండా మానవుగా. ఇప్పుడామె పాన్ ఇండియా హీరోయిన్ .
'పుష్ప' హిట్ తో ఆమె రేంజ్ మారిపోయింది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తుంది. అమ్మడు వేగాన్నిఅక్కడా ఆపడం సాధ్యమనే పని కాదు. బాలీవుడ్ టేస్ట్ కి తగ్గట్టు మౌల్డ్ అవుతుంది. రష్మిక పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది.
బ్రాండ్ అంబాసిడర్ గానూ దూసుకుపోతుంది. ఇప్పుడు రష్మిక కన్నడలో ఒక్క సినిమా చేస్తే ఆ సినిమాని ప్రేక్షకులు ఎగబడి చూడటానికి రెడీగా ఉన్నారు. తద్వారా కోట్ల రూపాయల ఆదాయం పరిశ్రమకి వచ్చినట్లే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.