2020 చివర్లో మరో విషాదం

Update: 2020-12-25 13:30 GMT
2020 సంవత్సరం అన్ని రంగాల వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ఈ ఏడాది ఆరంభం నుండే కరోనా కారణంగా తీవ్రమైన ఒడిదొడుకులు సినిమా ఇండస్ట్రీ కూడా ఎదుర్కొంది. ఇక ఈ ఏడాది చాలా మంది ఇండియన్‌ సినీ ప్రముఖులు కన్నుమూశారు. దిగ్గజాలు మృతి చెందడంతో సినిమా పరిశ్రమ ఎన్నో సార్లు దుఃఖంలో మునిగి పోయింది. ఈ ఏడాది ముగియబోతుంది. దాంతో ఇకపై అయినా విషాదాలు ఉండవని అంతా కొత్త ఏడాది 2021 కోసం ఎదురు చూస్తున్నారు. 2020 మరో అయిదు రోజుల్లో ముగియబోతుండగా కూడా ఇండస్ట్రీ మరో ప్రముఖుడిని కోల్పోయింది.

తెలుగులో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన ఓ ఎస్‌ ఆర్‌ ఆంజనేయులు మృతి చెందారు. 79 ఏళ్ల ఆంజనేయులు చెన్నైలో ఉంటున్నారు. తమిళనాడు నుండి ఇండస్ట్రీ ఏపీకి వచ్చిన సమయంలో కూడా ఆయన అక్కడే ఉండి పోయారు. ఆయన గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇటీవల ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు జాయిన్‌ అయ్యారు. ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఆంజనేయులు కు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. కృష్ణ నటించిన పలు సినిమాలకు ఆయన సహాయ దర్శకుడుగా వ్యవహరించారు. చిరంజీవి నటించిన లవ్‌ ఇన్ సింగపూర్‌ సినిమాకు ఆంజనేయులు దర్శకత్వం వహించారు. కన్నె వయసు అనే సినిమాను కూడా ఆయన తెరకెక్కించారు. 70కి పైగా సినిమాల్లో నటించిన ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. అలాంటి వ్యక్తి మృతి చెందడంతో ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News