సినిమాపై బ‌జ్ కోసం డైరెక్టర్ ప్లాన్డ్ కాంట్ర‌వ‌ర్సీ?

Update: 2022-06-15 17:30 GMT
యంగ్ టాలెంటెడ్ హీరో స‌త్య‌దేవ్ న‌టించిన లేటెస్ట్ మూవీ 'గాడ్సే'. గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. సి. క‌ల్యాణ్ నిర్మించిన ఈ మూవీ పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందింది. ట్రైల‌ర్ నుంచే ఆలోచ‌న‌లు రేకెత్తిస్తున్న ఈ మూవీ జూన్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు.

గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి గ‌తంలో స‌త్య‌దేవ్ తో 'బ్ల‌ఫ్ మాస్ట‌ర్' మూవీని రూపొందించారు. వీరిద్ద‌రి కాబినేష‌న్ లో వ‌స్తున్న రెండ‌వ సినిమా ఇది. స‌మ‌కాలీన రాజ‌కీయాల‌పై ఓ సామాన్యుడు పూరించిన స‌మ‌ర శంఖం నేప‌థ్యంలో ఈ మూవీని రూపొందించారు. స‌గ‌టు మ‌నిషికి ప్ర‌తీ వ్య‌వ‌స్థ‌లోనూ న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని వాదించే ఓ యువ‌కుడి క‌థ ఇది. ట్రైల‌ర్ లో స‌త్య‌దేవ్ ప‌లికిన డైలాగ్ లు సినిమాపై అంచ‌నాల్ని పెంచాయి.

అయితే మ‌రింత బ‌జ్ ని పెంచ‌డం కోసం ద‌ర్శ‌కుడు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఓ మీడియా కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించిన ద‌ర్శ‌కుడు ఇంట‌ర్వ్యూ చేస్తున్న వ్య‌క్తి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో సీరియ‌స్ ట‌ర్న్ తీసుకుంది. దీంతో అధికార పార్టీకి అమ్ముడు పోయావా? అంటూ ద‌ర్శ‌కుడు గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి ఇంట‌ర్వ్యూయ‌ర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం.. దానికి ప్ర‌తిగా ఇంట‌ర్వ్యూ చేస్తున్న వ్య‌క్తి కౌంట‌ర్ ఇవ్వ‌డంతో ద‌ర్శ‌కుడు గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి మ‌ధ్య‌లోనే లేచి వెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూ వైర‌ల్ గా మారింది.

రాజకీయ అంశాల నేప‌థ్యంలో తెర‌కెక్కిన మూవీ' గాడ్సే' ఈ మూవీకి ఆశించిన స్థాయి బ‌జ్ మాత్రం క్రియేట్ కాలేదు. ఇప్ప‌టికే అనేక సార్లు రిలీజ్ వాయిదా ప‌డిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. అయితే 'విరాట‌ప‌ర్వం' కూడా ఇదే రోజు విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో అంద‌రి దృష్టి ఆ మూవీపై ఎక్కువ‌గా వుంది. ఈ నేప‌థ్యంలో 'గాడ్సే' మూవీ డైరెక్ట‌ర్ గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి ఇంట‌ర్వ్యూవ‌ర్ తో గొడ‌వ‌కు దిగ‌డం.. ఆ వీడియో నెట్టింట వైర‌ల్ కావ‌డంతో 'గాడ్సే' మూవీ వార్త‌ల్లో నిలుస్తోంది.

ద‌ర్శ‌కుడు గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి ఇంట‌ర్వ్యూయ‌ర్ తో గొడ‌వ‌కు దిగ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అత‌డు అడిగిన ప్ర‌శ్న‌లే అని తెలుస్తోంది. సినిమాలో కొన్ని డైలాగ్ లు ప్ర‌స్తుతం ఏపీ అధికార పార్టీని టార్గెట్ చేసేలా వున్న‌యాని, ఈ విష‌యంపై కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల నుంచి మీకు బెదిరింపులు వ‌చ్చాయ‌ని తెలిసింది నిజ‌మేనా అని ఇంట‌ర్వ్యూ చేస్తున్న వ్య‌క్తి ప్ర‌శ్నించాడ‌ట‌. దీనికి ద‌ర్శ‌కుడు స‌మాధానం చెబుతూ .. తాను మాత్రం నిజాయితీగా సినిమా తీశాన‌ని, దీనిపై కాంట్ర‌వ‌ర్సీలు సృష్టించ‌డం క‌రెక్ట్ కాద‌ని, న‌న్ను బెదిరించార‌ని మీకు ఎవ‌రు చెప్పార‌ని.. మీ మాట‌లు చూస్తుంటే అధికార పార్టీకి అమ్ముడు పోయిన‌ట్టుగా అనిపిస్తోంద‌ని వ్యాఖ్యానించాడ‌ట‌.  

ఈ మాట‌ల‌కు ఇంట‌ర్వ్యూ చేస్తున్న వ్య‌క్తి రియాక్డ్ అయి .. మీరు ప్ర‌తిప‌క్ష పార్టీకి అమ్ముడు పోయిన‌ట్టుగా వుంద‌న్నాడ‌ట‌. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మాటా మాటా పెరిగ‌డంతో ద‌ర్శ‌కుడు ఇంట‌ర్డ్యూని మ‌ధ్య‌లోనే ఆపేసి వెళ్లిపోయే ప్ర‌య‌త్నం చేశాడ‌ట‌. ఆ త‌రువాత స‌ద‌రు వ్య‌క్తి స‌ర్ది చెప్ప‌డంతో ఇంట‌ర్వ్యూని కంటిన్యూ చేశాడ‌ట‌. ఈ మొత్తం వ్య‌వ‌హారం అంతా చూస్తుంటే సినిమాపై బ‌జ్ క్రియేట్ చేయ‌డం కోసమే కాంట్ర‌వ‌ర్సీని అయిన‌ట్టుగా క్రియేట్ చేసిన‌ట్టు వుంద‌ని ప‌లువురు కామెంట్ లు చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News