దర్శకుడిగా హీరోగా ఎన్ని సక్సెస్ లు సాధించినా ప్రభుదేవాకు డాన్సర్ గా ఉన్న గుర్తింపే వేరు. ఐదు పదుల వయసుకు దగ్గరలో ఉన్నా ఒంట్లో సత్తా ఏ మాత్రం తగ్గకుండా ఇప్పటికీ కుర్ర హీరోలను తలదన్నేలా తన బాడీని స్ప్రింగ్ లా మార్చి చేసే నృత్యాలు చూస్తుంటే అతనికి ఫ్యాన్ కాకుండా ఉండటం కష్టం. దర్శకుడిగా సైతం తనదంటూ ఒక ముద్ర వేసిన ప్రభుదేవా తన డ్రీం ప్రాజెక్ట్ గురించి ఇటీవలే బయటపెట్టాడు. ఎప్పటికైనా భారతీయ సినిమా గర్వపడే రేంజ్ లో మహాభారతం సినిమా తీయాలనేది ఆ లక్ష్యం. కాని దానికి 500 నుంచి 600 కోట్ల దాక బడ్జెట్ అవుతుంది కనక ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చాడు. కాని ఓ ఐదారేళ్ళ తర్వాత ఇండియన్ సినిమా మార్కెట్ ఆ రేంజ్ కు చేరుకుంటుందని అప్పుడు తీస్తే ఖచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని ధీమాగా చెబుతున్నాడు.
ఇదంతా బాగానే ఉంది కాని మహాభారతం మీద కన్ను వేసిన దిగ్గజాలు చాలానే ఉన్నారు. అమీర్ ఖాన్ హిందిలో-మలయాళంలో మోహన్ లాల్ తో- తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా ఇలా రకరకాల కాంబినేషన్ల గురించి ఇప్పటికే చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కన్నడలో కురుక్షేత్ర అనే సినిమా నిర్మాణంలో ఉంది కూడా. శాండల్ వుడ్ లో ఇప్పటి దాకా రాని అత్యంత భారీ బడ్జెట్ తో ఇది రూపొందుతోంది. ఇన్నేసి లైన్ లో ఉండగా ప్రభుదేవా తాను కూడా తీయాలనుకోవడం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది ఆలోచించాలి.
అన్నట్టు దీని మీద మన జక్కన్న రాజమౌళి కన్ను కూడా ఉంది. గతంలోనే మహాభారత గాధను జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో తీయాలనుందని గతంలోనే చెప్పాడు. కాని ఇప్పుడు కాదు కాని ఓ పదేళ్ళ తర్వాత తీసే ఆలోచన చేస్తానని చెప్పిన సంగతి గుర్తే. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ జమానాలో లెక్కలేనన్ని సినిమాలు ఈ ఇతిహాసం మీద వచ్చేవి కాని దానవీరశూరకర్ణ తర్వాత పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. మళ్ళి ఇన్నాళ్ళకు మన దర్శక నిర్మాతలు దీని మీద మనసు పారేసుకోవడం విశేషమే.