డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆడియోలు రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో జీవిత సత్యాలు బోధిస్తూ....ఆయన ఇన్ స్పైర్ అవుతూ...ఆయనతో పాటు ప్రేక్షకుల్ని ఇన్ స్పైర్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు పూరి యూ ట్యూబ్ లో చాలానే ఉన్నాయి. తాజాగా మరో ట్రాక్ తో ముందుకొచ్చేసారు.
`వయసులో ఉన్నప్పుడు ఏదో సాధించాలని తపన ఉంటుంది.. దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. యువత ఆలోచనల్ని తప్పు దోవ పట్టించే వారు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్లతో యువత చాలా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. యువ వయసులో రక్తం ఎగసెగసి పడుతుంది. మీ మజిల్స్...విజిల్స్ వేస్తుంటాయి. కాళ్లలో విపరీతమైన బలం ఉంటుంది.
ఒక చోట కూర్చోవాలనిపించదు. నిద్ర రాదు. ఎప్పుడు హైపర్ గా ఉంటారు. ఏది వద్దంటే అదే చేస్తారు. ఎప్పుడు ఏ పనిచేద్దామా? అని ఎదురు చూస్తుంటారు. భయం తెలియదు. భవిష్యత్ గురించి బెంగ..భయం రెండు ఉండవు. మీ యవసులో ఉన్న యువతరమే మేథావులకు కావాల్సింది. కానీ చాలా మంది యువతని తప్పు దోవ పట్టిస్తున్నారు.
మీతో ధర్నాలు..ఉద్యమాలు చేయిస్తారు. ఎందుకంటే ప్రతీ దానికి యూత్ కావాలి. గుడిలో భజన చేసేది మీరే. పండగలకు డాన్స్ చేసేది మీరే. సినిమా టిక్కెట్లు కోసం చొక్కాలు చించుకునేది మీరే. యుద్దంలో ముందుండే సైనికులు మీరే. చివరికి సూసైడ్ బాంబర్స్ కూడా మీరే. ఈ వయసులో మీకు కావాల్సింది మీలో స్పూర్తి నింపేవాళ్లు. మీరు ఎవర్నీ ఫాలో అవుతున్నారో మీకే తెలియదు.
యూత్ కోసం చాలా మంది మేథావులు మాట్లాడుతారు. అందరి ప్రసంగాలు అద్భుతంగా ఉంటాయి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటుంది. స్పూర్తిని నింపడం వేరు. రెచ్చగొట్టడం వేరు. తేడా తెలుసుకోకపోతే చాలా తప్పులు చేస్తారు. ప్రతీ ఒక్కరు మిమ్మల్ని ఉసిగొల్పుతారు. దయచేసి అలాంటి వాళ్ల మత్తులో పడి జీవితాలు నాశనం చేసుకోకండి. మీ అమ్మ-నాన్నమీ గురించి ఎన్నో కలలు కంటారు. వాటిని వదిలేసి ఇంకెవరో? కల కోసం బలి కావొద్దు.
మీరు జేజేలు..నినాదాలు చేస్తుంటే అవి ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. చొక్కా చించకున్నప్పుడు అది మీ నాన్న కష్టార్జితం అని గుర్తుంచుకోండి. చేయి కోసుకున్నప్పుడు మీ అమ్మకు తెలిస్తే ఎంత బాధ పడుతుందో ఊహించుకోండి. యుక్త వయసులో భగత్ సింగ్ లా దేశం కోసం చేస్తే ఒకే ..కానీ ఇంకెవరి కోసమో! అనవసరంగా చేస్తే మీ అంత ముర్ఖులు ఇంకొకరు ఉండరు. గుర్తు పెట్టుకోండి మంచి నాయకులు ఉంటారు. చెడ్డ నాయకులు ఉంటారు. మీలో స్పూర్తిని నింపే వారు ధైర్యం చెప్పి భుజం తడతారు. రెచ్చగొట్టే వారు లేనిపోనివి చెప్పి ఉసిగొల్పుతారు. జాగ్రత్త` అంటూ పూరి యువతని హెచ్చరించారు. మరి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇంకెన్ని రకాలుగా వైరల్ అవుతాయో ! చూడాలి. పూరి వ్యాఖ్యలు రాజకీయంగానూ కాక పుట్టించడం ఖాయమంటూ కొన్ని పోస్ట్ లు దర్శనమిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.