మ‌ళ్లీ గ‌రిక‌పాటిని కెలికిన వ‌ర్మ‌!

Update: 2022-10-12 13:15 GMT
అవ‌ధాని..ప్ర‌వ‌చ‌నా క‌ర్త‌ గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్య‌లు ఎంత‌టి దుమారాన్ని రేపాయో చెప్పాల్సిన ప‌నిలేదు. మెగా ప్రేక్ష‌కాభిమానులు నుంచి ఇండ‌స్ర్టీ వ‌ర‌కూ అంతా గ‌రిక‌పాటిపై ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు. త‌మ‌దై,న శైలిలో  విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ విష‌యంలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోల్ వ‌ర్మ సైతం  మెగాస్టార్ కి మ‌ద్ద‌తుగా నిలిచారు.

గ‌రిక‌పాటిపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌నాస్ర్తాలు సంధించారు.  మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం.. త్తగ్గేదెలె... అంటూ మొద‌లై వ‌ర్మ ఎటాక్  అన్ స్టాప‌బుల్ గా కొనసాగింది. వ‌ర్మ‌త‌న‌దైన శైలిలో చెల‌రేగిపోయారు.

ఎప్పుడు మెగాఫ్యామిలీని విమ‌ర్శించే వ‌ర్మీ సారి ఆ కుటంబానికి..అభిమానుల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంతో అంతా షాక్ అయ్యారు. ఆ ర‌కంగా మొన్న‌టి స‌న్నివేశంతో వ‌ర్మ అభిమానుల మ‌న‌సు గెలుచుకున్నాడు. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ మెగాఫ్యామిలీతో రాజీకి వ‌చ్చాడా? అంటూ కొన్ని సందేహాలు సైతం తెర‌పెకివ‌చ్చాయి.

ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే తాజాగా నేడు జ‌రిగిన ఓ మీడియా స‌మావేశంలో  నేరుగా మీడియా ముందే మ‌రోసారి గ‌రిక‌పాటిపై విరుచుకుప‌డ్డారు. ఓ పాత్రికేయుడు అడిగిన ప్ర‌శ్న‌కు గ‌రిక‌పాటిన త‌ప్పుబ‌ట్టారు. చిరంజీవిని గ‌రిక‌పాటి అన్న  వార్త తనకు ఆలస్యంగా తెలిసిందని .. అక్కడ చిరంజీవితో ఫోటోలు దిగే వ్యక్తులను కాకుండా చిరంజీవినే అనడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని వర్మ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ పాయింట్ ని వ‌ర్మ ట్వీట్ల స‌మ‌యంలో ఎత్తుకోలేదు. దీంతో నెటి జ‌నులు కొత్త సందేహాలు తెర‌పైకి తెస్తున్నార‌న‌.  చిరంజీవిని గరిక‌పాటి   కావాల‌నే  ప‌నిగ‌ట్టుకుని..అభిమానుల‌ను అడ్డుపెట్టుకుని అలా వ్యాఖ్యానించార‌ని అంటున్నారు.   అయితే ఈవిష‌యంలో గ‌రికపాటి ఇప్ప‌టికే మీడియా ముఖంగా చిరంజీవికి  క్ష‌మాపణ‌లు తెలియ‌జేసారు.

అంత‌కు ముందు  చిరంజీవి గారితో మాట్లాడుతాన‌ని మెగా అభిమాన సంఘాల‌కు ఫోన్ సంభాష‌ణ‌ల్లో చెప్ప‌డంతో శాంతించిన సంగ‌తి తెలిసిందే.  మొత్తానికి వివాదం మ‌రీ శృతి మించ‌కుండానే చ‌ల్లార్చిన వాతావ‌ర‌ణం క‌నిపించింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News