రెబెల్ స్టార్ ప్రభాస్ ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చాలా ఏళ్ళయింది. బాహుబలి షూటింగ్ సమయంలోనే 'సాహో'.. 'జాన్' రెండు సినిమాలకు ఓకే చెప్పాడు. ఈ రెండు సినిమాలలో 'సాహో' ఇప్పటికే రిలీజ్ అయింది. 'జాన్' కొంతభాగం షూటింగ్ పూర్తయింది.. ప్రభాస్ మిగతా షూటింగును పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమాలో నటిస్తాడనే విషయంపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది.
ప్రభాస్ బాలీవుడ్ సినిమాకు ఒకే చెప్పాడని ఇప్పటికే రూమర్లు ఉన్నాయి. అయితే తాజాగా ప్రభాస్ నెక్స్ట్ సినిమా గురించి మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. సౌత్ లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శంకర్ తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం శంకర్ 'భారతీయుడు 2' తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ తో ఒక భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించే ప్రయత్నాలలో ఉన్నారట. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించేందుకు ముందుకు వచ్చారట.
ఏదేమైనా ప్రభాస్- శంకర్ కాంబినేషన్ మాత్రం అటు ప్రేక్షకులలోనూ ఇటు ట్రేడ్ వర్గాలలోనూ సంచలనం సృష్టించేదే. ఇది ఊహాగానమేనా లేక నిజంగా పట్టాలెక్కుతుందా అనేది తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వేచిచూడకతప్పదు.