అమర్ అక్బర్ అంటోనీలో 'వాటా' ఉందట!

Update: 2018-11-10 07:11 GMT
తెలుగువాళ్ళంత ఐకమత్యంగా లేని వారు ఇంకెక్కడా ఉండరని బయటవాళ్ళ విమర్శ.  ఒక హిందీ వాడు ఇంకో హిందీ వాడు కలిసి భాయి భాయి అనుకుంటాడు. ఇద్దరు తమిళులు కలిస్తే తంబీ తంబి అనుకుంటారు.. ఇలా చెప్పుకుంటూ పొతే లిస్టు చాలా పెద్దది అవుతుంది.  అయినా ఇది నమ్మరు గానీ అమెరికాలో తెలుగు వాళ్లకి ఉన్నన్ని సంఘాలు మరెవ్వరికీ లేవన్న సంగతి అందరికీ తెలిసిందే.  దీనిమీద తంబీలు చాలా జోకులు కూడా వేస్తుంటారు.  తానా(TANA).. ఆటా(ATA).. నాటా(NATA).. టాటా(TATA).. ఇవి ముఖ్యమైనవి. ఇక వీటితో పాటు పెద్దగా మీడియాలో పాపులర్ కాని సంఘాలు పదుల కొద్దీ సంఖ్యలో ఉన్నాయి.

ఇప్పుడు ఈ తానాలు ఆటాల మీద శ్రీను వైట్ల కన్ను పడిందట. అందుకే కొత్తగా 'హోల్ ఆంధ్ర తెలంగాణా అసోసియేషన్(WATA) అంటూ కొత్త సంస్థ స్థాపించాడు. ఎందుకంటారా? మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమా కోసం. ఇందులో ప్రధాన సభ్యులు సునీల్.. శ్రీనివాస్ రెడ్డి.. రఘు బాబు.. వెన్నెల కిషోర్.. జయప్రకాష్ రెడ్డి.. సత్య.  ఇక ఇలాంటి సభ్యులు ఉంటే కల్చరల్ కార్యక్రమాలకు కొదవేముంటుంది చెప్పండి? మోహన రాగం నుండి ముమైత్ ఖాన్ తాళం వరకూ అన్ని కవర్ చేస్తారు.  ఈ వాటా ఎపిసోడ్ తో మన తెలుగు వారి సంఘాలపై సున్నితమైన కామెడీ పండిస్తారట.

ఈ సినిమా లో వాటా ఎపిసోడ్ ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని 'అమర్ అక్బర్ అంటోనీ' టీమ్ కాన్ఫిడెంట్ గా ఉందట.  కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయింది. మరి స్క్రీన్ మీద ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ నెల 16 వరకూ వేచి చూడాలి.  అన్నట్టు ఈ రోజే(శనివారం ) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతున్నారట. ఈ కార్యక్రమం లోనే థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల చేస్తారని సమాచారం.
    

Tags:    

Similar News