ప్రభాస్ ఇంతవరకూ చేసిన భారీ బడ్జెట్ చిత్రాల్లో 'సాహో' ఒకటి. టైటిల్ తోనే అమాంతంగా అంచనాలు పెంచేసిన సినిమా ఇది. విడుదలకి ముందు తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇతర ఇండస్ట్రీలవారు కూడా ఈ సినిమాను గురించి మాట్లాడుకున్నారు. తెలుగులో తెరకెక్కుతున్న హాలీవుడ్ సినిమా అని చెప్పుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని కనబరిచారు. ప్రభాస్ లుక్ చూసిన తరువాత ఈ సినిమా వసూళ్ల పరంగా ఒక సునామీని సృష్టిస్తుందని అంతా అనుకున్నారు.
ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహించాడు. వందల కోట్ల బడ్జెట్ .. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషలకి చెందిన సీనియర్ స్టార్లు .. దర్శకుడు చూస్తే కుర్రాడు. అంతకు ముందు 'రన్ రాజా రన్' అనే ఒక సినిమాను మాత్రమే తీసిన అనుభవం. దాంతో అందరూ ఈ విషయాన్ని గురించి ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టును సుజీత్ చేతుల్లో పెట్టడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. కళ్లు తిరిగిపోయే స్థాయిలో ఈ సినిమాకి పబ్లిసిటీ కోసం ఖర్చు చేశారు.
తీరా సినిమా రిలీజ్ అయిన తరువాత తెరపై ఖర్చు తప్ప .. కథ కనిపించలేదు. ప్రభాస్ కి గల క్రేజ్ కారణంగా వసూళ్లు ఆగలేదు. కానీ అభిమానుల అంచనాలకు ఆమడ దూరంలో ఉండిపోయింది. కుర్రాడే అయినా ఈ మాత్రం తీయగలగడం గొప్పే అన్నవారూ ఉన్నారు. అయితే ఆ స్థాయిలో కాకపోయినా, ఓ మాదిరి బడ్జెట్ సినిమాలు చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఎందుకనో ఎక్కడా సుజీత్ పేరు వినిపించడం లేదు .. కనిపించడం లేదు. ఫ్లాపులు రావడం సహజమనుకుని, ఇప్పటికైనా కుర్రాడు తన ప్రయత్నాలు తను చేయాలి. కొత్త కథలను ఉత్సాహంతో ఉరుకులు పెట్టించాలి.