సాహో బాక్స్ ఆఫీస్ రిజల్ట్ గురించిన చర్చ కాసేపు పక్కన పెడితే మొదటి వారం మొత్తం ఇది లార్గో వించ్ మూవీ ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిన అజ్ఞాతవాసితో పోలికలు పెడుతూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. కథలోని కీలక పాయింట్ వాటితో పోలి ఉండటంతో అందరూ ఇది అదే అని నిర్ధారణకు వచ్చి బాగానే ట్రోలింగ్ చేశారు. దీనికి తాజాగా సుజిత్ స్పందించాడు.
అసలు తాను లార్గో వించ్ చూడలేదని ఇప్పుడు కామెంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా చూసి ఉండరని నమ్మకంతో చెబుతున్నాడు. తాను ఆ సినిమా చూడలేదంటున్న సుజిత్ లార్గో వించ్ లో ఎక్కడో పెరిగిన వారసుడు తాను చనిపోయిన నాన్నకు పుట్టిన బిడ్డేనని రుజువు చేసుకోవడం అందులో పాయింట్ అని చెప్పడం గమనార్హం. మరి సినిమానే చూడలేదన్న సుజిత్ లార్గో వించ్ లోనే అసలు ప్లాట్ ని ఇంత చక్కగా ఎలా చెప్పగలిగాడు
సుజిత్ స్పందించిన సంగతి అలా ఉంచితే సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టఫ్ సిచువేషన్ ని ఫేస్ చేస్తోంది. డ్రాప్ అయిన వసూళ్లు పికప్ అవుతాయా లేదా అనే టెన్షన్ లో ట్రేడ్ ఇప్పటికే సతమతమైపోతోంది. నార్త్ లో కన్నా తెలుగు రాష్ట్రాల్లోనే సాహో ని రిసీవ్ చేసుకోవడం నెగటివ్ గా ఉంది.
తెలుగు అబ్బాయి పాన్ ఇండియా సినిమా చేస్తే ఎంకరేజ్ చేయడం లేదన్న సుజిత్ ఇదే దర్శకుడి మొదటి సినిమాను హీరో ఇమేజ్ ఖర్చు చేసిన బడ్జెట్ తో సంబంధం లేకుండా ఎలా ఆదరించారన్న విషయాన్ని మర్చిపోకూడదు. మొత్తానికి తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి సుజిత్ గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. అయినా సానుభూతి మీద సినిమాలు ఆడే రోజులు కావు కాబట్టి సాహో ఎంతమేరకు నష్టాలు తగ్గించుకుంటుందో అని ఎదురు చూడటమే మనం చేయాల్సిన పని.