వెటర్నరీ వైధ్యురాలిపై అఘాయిత్యం.. హత్య నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు దాదాపు అంతా కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. దిషాకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు దిషా సంఘటనపై స్పందించిన తీరు నిజంగా అభినందనీయం. ఇక తాజాగా దర్శకుడు సుకుమార్ చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలు అందరిని ఆలోచింపజేస్తున్నాయి.
దిషా సంతాప సభలో పాల్గొన్న దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. సంఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన ఆయన ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నాడు. నేరస్తులు అనే వారు ఎక్కడి నుండో రారు అని మన మద్యలోనే ఉన్నారని ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉంది అన్నాడు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఘోరాలను చెప్పడానికి తాను సరిపోనన్నాడు.
ఆ సమయంలో దిషా పోలీస్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేస్తే బాగుండేది అంటూ చాలా మంది అంటున్నారు. నలుగురు కుర్రాళ్లు సాయం చేస్తాం అంటూ వచ్చినప్పుడు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు ఎలా చేస్తారు. వారు మంచి వారు అనే ఎవరైనా నమ్ముతారు. దిషా కూడా అదే చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సాయం చేస్తామని వచ్చిన వారు మంచి వారు అయితే బాధపడతారేమో అని ఆమె అనుకుని ఉంటుంది. కాని మేమంతా కూడా మానవ మృగాళ్లం తల్లి.. మమ్ములను నమ్మకుండా ఉండాల్సింది. దయచేసి మమ్ములను నమ్మొద్దు.
బయటి వారిని మాత్రమే కాదు సొంత వారిని కూడా నమ్మే పరిస్థితి లేదు. అందువల్ల ప్రతి ఒక్కరిని అనుమానించాలంటూ సుకుమార్ అమ్మాయిలకు సూచించాడు. ఎవరిపై అయినా అనుమానం వస్తే 100 కు డయల్ చేయాలని.. ఆతర్వాత వారు మంచి వారని తెలిస్తే వారికి క్షమాపణ చెప్పినా పోయేది ఏమీ లేదంటూ సుకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.