బ‌డా నిర్మాణ సంస్థ‌లో సుకుమార్ మ‌రో శిష్యుడు!

Update: 2022-12-22 02:30 GMT
`ఉప్పెన` స‌క్సెస్ తో సుకుమార్  ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా ఏ రేంజ్ లో ఫేమ‌స్ అయ్యాడో తెలిసిందే. ఏకంగా రెండ‌వ సినిమాని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తోనే చేస్తున్నాడు. దీనికి సుకుమార్ లోలోప‌ల ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నాడు. త‌న ప్రియ శిష్యుడు ఎదుగుద‌ల‌న చూసి అత‌నే ఆశ్చ‌ర్యానికి గుర‌వుతోన్న సంద‌ర్భం ఇది. ఓ గురువుకి గురు ద‌క్ష‌ణ‌గా ఇంత‌క‌న్నా కావాల్సింది ఏమంటుంది? ఇప్పుడిదే కోవ‌లో మ‌రో శిష్యుడు ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. అత‌నే ప‌ల్నాటి  సూర్య ప్ర‌తాప్.

`క‌రెంట్`..`కుమారి 21 ఎఫ్` లాంటి చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టిన సూర్య ప్ర‌తాప్ కూడా సుకుమార్ ప్రియ శిష్యుడే. బుచ్చిబాబు క‌న్నా ముందుగానే శిష్య‌రికం పూర్తి చేసి సొంతంగా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టి స‌క్సెస్ అయ్యాడు. ఇత‌ని విజ‌యం వెనుక గురువు నిలిచాడు. సూర్య ప్ర‌తాప్ డైరెక్ట్ చేస్తున్న కొన్ని క‌థ‌లు సుకుమార్ రైటింగ్స్ నుంచి వ‌చ్చిన‌వే.

ఆ ర‌కంగా మొద‌టి శిష్యుడ్ని బ‌య‌ట‌కు వ‌దిలి ద‌ర్శ‌కుడ్ని చేసాడు. అటుపై బుచ్చిబాబు వ‌చ్చాడు.  తాజాగా `18 పేజీస్` సినిమాతో సూర్య ప్ర‌తాప్ ప్రేక్ష‌కుల ముంద‌కు  రాబోతున్నాడు. ఇది డిఫ‌రెంట్ చిత్ర‌మ‌ని తెలుస్తోంది. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే  బుచ్చిబాబు క‌న్నా సూర్య ప్ర‌తాప్  నెమ్మ‌దిగా ప్ర‌మోట్ అవుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ చిన్న  బ్యాన‌ర్లలో సినిమాలు చేసుకుంటూ వ‌చ్చాడు.

తాజాగా సూర్య ప్ర‌తాప్ కూడా గేర్ మార్చిన‌ట్లే క‌నిపిస్తున్నాడు. అప్ క‌మింగ్ ప్రాజెక్ట్ లు రెండు బ‌డా బ్యాన‌ర్ల‌లోనే తెర‌కెక్కిస్తున్న ట్లు రివీల్ చేసాడు.  మైత్రీ మూవీ మేక‌ర్స్ లో ఒక సినిమా.... సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ లో ఒక సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  అలాగే ఆయ‌న సుకుమార్ నుంచి ఐదు క‌థ‌లు తీసుకున్నాడుట‌. వాటిలో  రెండు పూర్తిచేసాడుట.

మూడు క‌థ‌లు  పెండింగ్ ఉన్నాయ‌ట‌. త‌ను సొంతంగా మ‌రో క‌థ సిద్దం చేసి పెట్టుకున్నాడుట‌. ఆ క‌థ ఓ సంస్థ‌లో లాక్ అయిన‌ట్లు తెలిపాడు. అయితే మైత్రీ...సితార బ్యాన‌ర్లో  చేసే సినిమాల్లో హీరోలు ఎవ‌రు? అన్న‌ది రివీల్ చేయ‌లేదు. ఆ బ్యాన‌ర్లలో ఛాన్సులంటే స్టార్ హీరోలే అయి ఉంటార‌ని చెప్పొచ్చు. అలాగే ఇకపై సూర్య ప్ర‌తాప్ వేగంగా సినిమాలు చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాన‌ని ప్రామిస్ చేసాడు. ఆ ర‌కంగా  లెక్క‌ల మాష్టారు రెండ‌వ శిష్యుడు బిజీ ద‌ర్శ‌కుడిగా మార‌బోతున్నాడు. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News