బహుశా దేశంలో ఏ సినీ పరిశ్రమలోనూ ఓ మహా గొప్ప అలవాటు మన స్టార్ హీరోలకు ఉంది. అవార్డు ఫంక్షన్స్ లో అందరూ సందడి చేయడం అనే సంఘటన చూసే అవకాశమే ప్రేక్షకులకు రాదు. ఏ హీరోకు అవార్డ్ వస్తే.. ఆ స్టార్ మాత్రం తప్పకుండా వచ్చి తీసుకుంటూ ఉంటారంతే.
నామినీస్ అందరూ హాజరైతే.. ఎవరికి ఆ అవార్డ్ దక్కుతుందో అనే టెన్షన్ ఆడియన్స్ కి కూడా ఉంటుంది. కానీ నలుగురు నామినీస్ లో ఒక్కరే ఆ ఫంక్షన్ కి అటెండ్ అవగానే.. అవార్డ్ ఎవరికో ముందే అర్ధమైపోతుంది. అంటే.. తమకు అవార్డ్ ఇవ్వకపోతే తెలుగు స్టార్స్ ఎవరూ ఆ వేడుకలకు హాజరుకారన్న మాట. ఇలాంటి పరిస్థితికి కారణం.. వాళ్ల ఫ్యాన్సే అంటున్నాడు దర్శకుడు తేజ. 'తెలుగు స్టార్లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. తమకు అవార్డ్ రానపుడు ఆ ఫంక్షన్ కు రావడం ఫ్యాన్స్ కు నచ్చదనే ఉద్దేశ్యంతోనే చాలామంది యాక్టర్లు హాజరు కారు' అని చెప్పాడు తేజ.
'ఈ ఫ్యాన్స్ కారణంగా.. తమకు అవార్డ్ రానపుడు ఇతరులను అభినందించడానికి వస్తే, తమ ఇమేజ్ పాడవుతుంది ఫీలవుతూంటారు. అందుకే అందరు నామినీలు కనిపించే సందర్భం అసలు కనిపించదు. ఇతర పరిశ్రమల్లో ఇలాంటి పరిస్థితులు లేవు' అంటూ అసలు సీక్రెట్ చెప్పేశాడు తేజ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/