హిప్పీ అంటే ఏంటి మీనింగ్? అంటే .. సంచారి అనే అర్థం. ప్రేమలో సంచారి అని ఇదివరకూ హైదరాబాద్ ప్రెస్ మీట్లో వెల్లడించింది హిప్పీ టీమ్. మరోసారి దీనిపై క్లియర్ కట్ గా చెప్పుకొచ్చారు దర్శకుడు టి.ఎన్.కృష్ణ. నేడు హైదరాబాద్ లో జరిగిన హిప్పీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో టి.ఎన్.కృష్ణ మాట్లాడుతూ హిప్పీ మీనింగ్ చెప్పారు.
హిప్పీ అంటే స్పాంటేనియస్ గై. కొన్నిసార్లు అది పాజిటివ్‌గానూ ఉండొచ్చు.. నెగటివ్‌గానూ ఉండొచ్చు. మనసులో ఏం పెట్టుకోడు హీరో. ఏం అనిపిస్తే అది చేస్తాడు. అందులో లవ్ .. రొమాన్స్ ఏదైనా... అని తెలిపారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాంటెంపరరీ సినిమా. ఈ జనరేషన్‌కి కావాల్సింది తెరనిండుగా కనిపిస్తుంది. అసలు స్ఫూర్తి ఏదైనా ఉందా? అంటే.. 14వ శతాబ్దంలో ఉన్న జాన్ మిల్టన్ అనే బ్రిటిష్ కవి రాసిన `ప్యారడైస్ లాస్ట్`.. `ప్యారడైస్ రీగెయిన్` అనే పుస్తకాల ఆధారంగా స్క్రిప్టు ను మలుచుకుని తెరకెక్కించాం. అందులో అతను ఆడమ్ అండ్ ఈవ్‌ను పాత్రలుగా పెట్టి కథలు రాస్తే.. నేను కాంటెంపరరీగా స్క్రిప్టును రాసుకున్నా.. అని తెలిపారు.
ఫ్లర్టింగ్ .. లిప్ లాక్ లు ఉన్నాయి కదా? అంటే.. మొత్తం ప్రేమే ఉంటుంది. ఫ్లర్టింగ్ కాదు. అసలు ప్రేమ ఎలా పుట్టిందనే దానిమీదే సినిమా ఉంటుంది. ఆ పాయింట్ కొత్త పాయింట్. ఇప్పటిదాకా ఎవరూ చూపించలేదు. స్వీయానుభవాలతో తీసిన బయోపిక్కా? అని అడిగేస్తే? ``ప్రేమలో అనుభవం లేకపోతే.. అందంగా ప్రేమ కథలు చెప్పలేమని నేను భావిస్తాను. 45 వయసులో చాలా అనుభవాలుంటాయి కదా... వాటిని ఇందులో పొందుపరిచాను. నా అనుభవాలు కార్తికేయ- జేడీ ఇరువురి పాత్రల్లో ప్రతిబింబిస్తాయి. అలాగని ఇది నా బయోపిక్ కాదు. నా వ్యక్తిగత అనుభవాలు అనుభూతుల సమాచారం అని చెప్పొచ్చు. ఇక జేడీ పాత్ర కార్తికేయకు గురువు కాదు.. ఒక సోక్రటీస్ తరహా పాత్రలో నటించారు. ఆయన పాత్ర అందరికీ నచ్చుతుంది.. అని చాలానే చెప్పారు. యువతరంలో సంబంధ బాంధవ్యాల సమస్య ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? వంటి విషయాలను తెరపై చర్చించామని అన్నారు. `నువ్వు నేను ప్రేమ` తర్వాత కొంత గ్యాప్ అనంతరం తెరకెక్కించిన తెలుగు స్ట్రెయిట్ చిత్రమిదని వెల్లడించారు.