'వకీల్ సాబ్'లో స్పెషల్ సాంగ్ ఉంది: డైరెక్టర్ వేణుశ్రీరామ్

Update: 2021-04-08 07:30 GMT
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'వకీల్ సాబ్'. దాదాపు మూడేళ్లకు పైగా విరామం తర్వాత వకీల్ సాబ్ మూవీతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే అన్ని హంగులతో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ సంవత్సర కాలంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఫినిష్ చేశారు మేకర్స్. ప్రస్తుతం వకీల్ సాబ్ సాంగ్స్, ట్రైలర్ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసాయి. అవి సినిమా పై అంచనాలు పెంచినప్పటికి ఈ సినిమా బాలీవుడ్ పింక్ మూవీకి రీమేక్ అని తెలిసిందే. ఇందులోకి పవర్ స్టార్ కాలు పెట్టేసరికి మేకర్స్ పింక్ మూవీని ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టకుండా.. స్టోరీ లైన్ మాత్రమే తీసుకున్నారట.

ఆ స్టోరీని బట్టి పవన్ కళ్యాణ్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రాసుకొచ్చారు. అయితే వకీల్ సాబ్ లో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయని కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దాని పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా మాట్లాడి సినిమా పై ఆసక్తి పెంచేసాడు. ఈ సినిమాకు నాలుగు సాంగ్స్ అందించాడు. తాజాగా వకీల్ సాబ్ సెకండ్ హాఫ్ లో ఓ బిగ్ సర్ప్రైజ్ ఉందని.. దానిగురించి ఇప్పుడే చెప్పను అన్నాడు. కానీ అభిమానులు మాత్రం సెకండ్ హాఫ్ లో ఏముందో ఊహించేసారు. కానీ మరోసారి క్లారిటీ ఇవ్వటానికి ట్రై చేసాడు డైరెక్టర్ వేణుశ్రీరామ్. 'అవును ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. కానీ అది సాడ్ గా ఉండబోతుంది. స్టోరీకి తగిన పరిస్థితిలో వస్తుందని చెప్పాడు. ఇప్పటికే వకీల్ సాబ్ బుకింగ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా.. శృతిహాసన్, అంజలీ, నివేదా థామస్, అనన్య కీలకపాత్రలలో నటించారు.
Tags:    

Similar News