ఆ అమ్మాయి విషయంలో డైరెక్టర్ రాంగ్‌ ఛాయిస్‌ !!

Update: 2022-09-07 13:30 GMT
సుధీర్‌ బాబు హీరోగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈనెల 16వ తారీకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. సినిమా లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించడంతో అంచనాలు మొన్నటి వరకు భారీగానే ఉన్నాయి. కానీ ఆమె ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో కృతి శెట్టి పాత్ర ఒక హీరోయిన్‌ గా ట్రైలర్‌ ను చూస్తుంటే అర్థం అవుతుంది. సినిమా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుంది. సుధీర్‌ బాబు తన సినిమాలో కృతి శెట్టిని నటింపజేసేందుకు తీవ్రంగా ప్రయత్నించి ఆమెతో ఓకే అనిపిస్తాడు. కానీ సినిమా అంటే అస్సలు ఇష్టం ఉండని కృతి శెట్టి ఫ్యామిలీ ఆమెను నటించేందుకు అంగీకరించరు.

అప్పుడు హీరో ఏం చేస్తాడు.. అసలు హీరోయిన్ కుటుంబ సభ్యులు ఎందుకు సినిమా అంటే ఇష్టపడరు అనేది సినిమా కథగా సాగబోతుందని ట్రైలర్ లో అటు ఇటుగా చూపించారు. స్టోరీ లైన్‌ ఇంట్రెస్ట్‌ గా ఉంది.. గతంలో ఇలాంటి సబ్జెక్ట్‌ లు వచ్చి పాజిటివ్‌ రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. కనుక ఈ సినిమాకి కూడా పాజిటివ్ బజ్ క్రియేట్‌ అయ్యింది.

ఈ సమయంలో సినిమాలో హీరోయిన్ పాత్ర కి గాను కృతి శెట్టి కాకుండా మరెవరైనా అయితే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా లో సాదారణంగా నటించడం ఓకే.. నటిస్తున్నట్లుగా నటించడం అంటే చాలా ఠఫ్‌ విషయం. ఆ ఛాలెంజ్ ను కృతి శెట్టి ఎంత వరకు నిర్వర్తిస్తుంది అనేది అనుమానం గా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అనుభవం తక్కువ మరియు వయసు కూడా తక్కువ కనుక కృతి శెట్టిని ఎంపిక చేసుకోవడం అనేది దర్శకుడి రాంగ్‌ ఛాయిస్ అంటూ సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అయితే వారి అభిప్రాయం ను ఈ అమ్మడు తప్పు అని నిరూపిస్తుందా అనేది చూడాలి.

ఉప్పెన తో పాటు వరుసగా మూడు సినిమాలు సక్సెస్ అవ్వడంతో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడటంతో ఈ సినిమా విషయంలో కాస్త అటు ఇటుగా చర్చ జరుగుతోంది. ఈ సినిమాతో ఆమె సక్సెస్ ని దక్కించుకుంటే తప్పకుండా మళ్లీ కృతి శెట్టి ఇండస్ట్రీ లో బిజీ అవ్వడం ఖాయం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News