మళ్లీ డిజార్డర్స్‌ బాట పట్టిన హీరోల దర్శకులు

Update: 2020-03-05 00:30 GMT
భలే భలే మగాడివోయ్‌ సినిమాలో నాని గతం మర్చి పోతూ ఉంటాడు.. రంగస్థలం చిత్రంలో రామ్‌ చరణ్‌ కు చెవులు సరిగా వినిపించవు.. జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్‌ ఒక పాత్రకు నత్తి పోతుంది.. ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంలో హీరో జ్ఞాపకశక్తి మారుతూ ఉంటుంది. ఇలా కొన్నాళ్ల క్రితం హీరోలకు ఏదో ఒక రుగ్మతను చూపించి దర్శకులు సక్సెస్‌ లు దక్కించుకున్నారు. హీరోలను హీరోల మాదిరిగా చూడాలని ప్రస్తుతం ప్రేక్షకులు ఏమీ ఆశ పడటం లేదు. అందుకే దర్శకులు కొత్తగా ట్రై చేస్తున్నారు.

గతంలో దర్శకులు ప్రయత్నించినట్లుగా ప్రస్తుతం కూడా అదే తరహాలో హీరోలకు డిజార్డర్స్‌ ఉన్నట్లుగా చూపించే సినిమాలు రాబోతున్నాయి. రెడ్‌ సినిమాలో రామ్‌ కు ఏదో డిజార్డర్‌ తో బాధ పడుతూ కనిపించబోతున్నాడట. అదే విధంగా సోలో బ్రతుకే సో బెటర్‌ చిత్రంలో హీరో సాయి ధరమ్‌ తేజ్‌ అమ్మాయిలు అంటేనే ఎలర్జీ అన్నట్లుగా ప్రవర్తిస్తూ కనిపించబోతున్నాడట. ఇక విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో చేస్తున్న ‘లైగర్‌’ చిత్రంలో కూడా ఏదో డిజార్డర్‌ తోనే కనిపించబోతున్నట్లుగా ఇన్‌ సైడ్‌ టాక్‌.

గతంలో ఇలాంటి కాన్సెప్ట్‌ లతో వచ్చిన సినిమాలు ఎక్కువ శాతం సక్సెస్‌ అయ్యాయి కనుక ఇవి కూడా ఆకట్టుకుంటాయనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు కూడా సమ్మర్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ మూడు కాకుండా ఈ ఏడాది మరెంత మంది హీరోలను డిజార్డర్స్‌ తో చూస్తామో..!

Tags:    

Similar News